ఆఫ్రికాలో తుపాను భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో వందకు పైగా మృతి చెందారు. నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుఫాను ఆఫ్రికాను అతలాకుతలం చేసింది. ఆఫ్రికా మలావిలో ఫ్రెడ్డీ తుఫాను కారణంగా ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. నీటి ప్రవాహంలో ప్రజలు కొట్టుకుపోతున్నారు.
భవనాలు కుప్పకూలిపోతున్నాయి. తుఫాను ధాటికి దక్షిణ, మధ్య ఆఫ్రికాలో సహాయక చర్యలు చేపడుతున్న ఎమెర్జెన్సీ బృందాలకు ఇబ్బందిగా మారింది. ఎక్కువగా మట్టి నివాసాలే వుండటంతో అవి క్షణంలోనైనా కూలిపోయి ప్రజలపై పడే అవకాశం వుందని పోలీసు అధికారులు చెప్తున్నారు.