Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రూ. 24 కోట్లు అప్పు చేసిన 59 ఏళ్ల మహిళ... ఎగ్గొట్టేందుకు 30 ఏళ్ల యువతిలా మారిపోయింది...

అప్పులు ఇస్తే తీసుకోనివారెవరు...? ఐతే కొంతమందికి అప్పులు తీసుకోవడం అంటే చాలా భయం. మళ్లీ తీసుకున్న అప్పును చెల్లించలేమని చాలామంది అప్పులు తీసుకునేందుకు జంకుతారు. కొందరు మాత్రం అప్పు పుడుతుందంటే చాలు ఎగ

రూ. 24 కోట్లు అప్పు చేసిన 59 ఏళ్ల మహిళ... ఎగ్గొట్టేందుకు 30 ఏళ్ల యువతిలా మారిపోయింది...
, మంగళవారం, 1 ఆగస్టు 2017 (13:03 IST)
అప్పులు ఇస్తే తీసుకోనివారెవరు...? ఐతే కొంతమందికి అప్పులు తీసుకోవడం అంటే చాలా భయం. మళ్లీ తీసుకున్న అప్పును చెల్లించలేమని చాలామంది అప్పులు తీసుకునేందుకు జంకుతారు. కొందరు మాత్రం అప్పు పుడుతుందంటే చాలు ఎగేసుకుంటూ వెళ్లిపోయి అప్పులు చేసేస్తారు. ఎందుకో తెలుసా..? ఇలాంటివారంతా ఎంచక్కా అప్పు చేసి ఆ తర్వాత కనిపించకుండా పారిపోతారు. లేదంటే ఐపీ పెట్టేసి డబ్బంతా బినామీలకు రాసేసి తనవద్ద ఏమీ లేదంటూ కోర్టు ఎదుట లొంగిపోతారు. 
 
ఐతే ఇవన్నీ కాదని ఓ కిలాడీ లేడీ ఓ పని చేసింది. వివరాల్లోకి వెళితే... చైనాకు చెందిన ఝు నాజువాన్ అనే మహిళ వివిధ బ్యాంకుల నుంచి రూ. 24 కోట్లు అప్పులు తీసుకుంది. ఐతే ఆ అప్పు తీర్చుకుండా తప్పించుకుని తిరుగుతోంది. దీనితో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు. తీసుకున్న అప్పంతా తిరిగి చెల్లించాల్సిందేనంటూ కోర్టు తీర్పు చెప్పింది. దీనితో ఆమె ఏమీ చేయలేక తప్పించుకునేందుకు కొత్త పథకం వేసింది. 
 
ఇందులో భాగంగా ఆమె ఆగ్నేయ చైనాకు పారిపోయి అక్కడ తనను ఎవరూ గుర్తుపట్టకుండా వుండేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఐతే ఆమె ఐడీ కార్డులు, ఫోన్ నెంబరు ఆధారంగా ఆమె వద్దకు వెళ్లిన పోలీసులు షాక్ తిన్నారు. అప్పు తీసుకున్న మహిళకు 59 ఏళ్లు వుంటాయనీ, కానీ ప్లాస్టిక్ సర్జరీ తర్వాత ఆమె 30 ఏళ్ల వయసున్నట్లు మారిపోయిందని వెల్లడించారు. చివరకు ఆమెకు ఆమెగా తనే అప్పు ఎగ్గొట్టిన మహిళ అని చెబితే తప్ప జనం ఆమెను గుర్తించలేకపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితాంతం గుర్తుండాలని పెళ్లి వేదిక వద్దకు పెళ్ళికొడుకు ఎలా వచ్చాడో తెలుసా (Video)