Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి

Advertiesment
కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి
, శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:32 IST)
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి హెల్త్ వర్కర్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ మహమ్మారి దెబ్బకు ఏకంగా 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్లు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. 
 
ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌ల‌కు తొలుత కోవిడ్ టీకాల‌ను ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియాసిస్ తెలిపారు. కోవిడ్ టీకాల పంపిణీలో జ‌రుగుతున్న అస‌మాన‌త‌ల‌ను ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. 
 
గ‌త ఏడాది జ‌న‌వ‌రి నుంచి ఈ ఏడాది మే వ‌ర‌కు కోవిడ్‌పై పోరాటంలో హెల్త్‌వ‌ర్క‌ర్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కోవిడ్ టీకాల జాప్యం వ‌ల్ల క‌రోనా వ‌చ్చే ఏడాది కూడా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్న‌ట్లు మ‌రో డ‌బ్ల్యూహెచ్‌వో అధికారి తెలిపారు.
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 135 మిలియ‌న్ల మంది హెల్త్ వ‌ర్క‌ర్లు ఉన్నారు. అయితే 119 దేశాల‌కు చెందిన డేటా ప్ర‌కారం.. ప్ర‌తి అయిదుగురిలో ఇద్ద‌రు మాత్ర‌మే పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. 
 
ఆఫ్రికాలో ప‌ది మందిలో, ఒక హెల్త్‌వ‌ర్క‌ర్ మాత్ర‌మే వ్యాక్సినేట్ అయిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇక సంప‌న్న దేశాల్లో ప‌ది మందిలో.. 8 మంది టీకాలు వేయించుకున్న‌ట్లు టెడ్రోస్ తెలిపారు. ఆఫ్రికాలో కేవ‌లం 5 శాతం జ‌నాభా మాత్ర‌మే వ్యాక్సిన్ వేసుకున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీక్ష అక్క‌డే... ప‌డ‌కా అక్క‌డే... కొబ్బరి నీళ్ళు ఇచ్చినా తాగ‌ని బాబు!