Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోళ్లు తీసుకున్న వ్యక్తిని ఉగ్రవాది అనుకున్నారు.. రైలులోనే పరుగులు తీశారు..

రైలులో కూర్చుని గోళ్లు తీసుకుంటున్న వ్యక్తిని చూసి ప్రయాణీకులంతా పరుగులు తీశారు. లండన్‌లోని ట్యూబ్ ట్రైన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోళ్లు తీసుకునేందుకు టైమ్ లేక ఓ వ్యక్తి రైలులో కూ

Advertiesment
గోళ్లు తీసుకున్న వ్యక్తిని ఉగ్రవాది అనుకున్నారు.. రైలులోనే పరుగులు తీశారు..
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (16:34 IST)
రైలులో కూర్చుని గోళ్లు తీసుకుంటున్న వ్యక్తిని చూసి ప్రయాణీకులంతా పరుగులు తీశారు. లండన్‌లోని ట్యూబ్ ట్రైన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గోళ్లు తీసుకునేందుకు టైమ్ లేక ఓ వ్యక్తి రైలులో కూర్చుని హ్యాపీగా నెయిల్ కటర్‌తో గోళ్లు తీసుకుంటున్నాడు. అప్పుడు టిక్ మంటూ ఏదో శబ్ధం రావడంతో ప్రయాణీకులు అతను ఓ ఉగ్రవాది అంటూ పరుగులు తీశారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా వుండాలని ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ప్రజలు ఈ విషయంలో అతి జాగ్రత్త పాటిస్తున్నారు. ఉగ్ర‌వాదుల భ‌యంతో అనుమానాస్పదంగా ఎవ‌రయినా క‌నిపిస్తే ప‌రుగులు తీస్తున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే లండన్‌లోని ఓ రైల్లో చోటు చేసుకుంది.
 
పిక్కాడిల్లీ నుంచి కాక్ఫస్టర్స్ వెళుతున్న ట్యూబ్ ట్రైన్‌లో ఓ ప్రయాణికుడు రైల్లోకూర్చుని గోళ్లు తీసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది వైరల్ అవుతోంది. ఇలా ఉగ్రవాది అనుకుని పరుగులు తీసిన జనమంతా అవతలి స్టాప్ రాగానే దిగేశారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూస్ చదువుతుండగా కబుర్లు.. టెక్నికల్ స్టాఫ్‌పై లైవ్‌లోనే ఫైర్ అయిన న్యూస్ రీడర్..!