Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రెడిట్ కార్డ్‌ల రుణం చెల్లించలేక.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాన్ని మార్చేసింది..

క్రెడిట్ కార్డుల ద్వారా భారీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన ఓ మహిళ తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చేసుకుంది. అయితే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertiesment
క్రెడిట్ కార్డ్‌ల రుణం చెల్లించలేక.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాన్ని మార్చేసింది..
, సోమవారం, 31 జులై 2017 (11:05 IST)
క్రెడిట్  కార్డుల ద్వారా భారీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన ఓ మహిళ తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చేసుకుంది. అయితే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 59 ఏళ్ల జూ నజూవాన్ అనే మహిళ.. క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను తీసుకుని జల్సా చేసింది. విందులు, వినోదాల పేరిట ఆడంబరంగా జల్సా చేసింది. 
 
అయితే క్రెడిట్ కార్డుల నుంచి పొందిన ధనాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. కానీ బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. వేరే దారి లేకుండా తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చేసుకుంది. అయినప్పటికీ ఆమెను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జూ నజూవాన్ తరహాలోనే చాలామంది చైనీయులు క్రెడిట్ కార్డు అప్పుల్ని చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డులను చైనాలో నిషేధించాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర హోంశాఖా మంత్రిగా అమిత్ షా.. రాజ్‌నాథ్‌కు ఉద్వాసన?