సైనికులు ఆయుధాలు ఉపయోగించని ఆ గడ్డపై పశువులు పచ్చిక మేస్తాయి.. ఇదేం చిత్రం?
భారత్, చైనాల మధ్య సిక్కింలోని డోక్లాంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, డ్రాగన్ సైనికులు మన భూభాగంలోకి చొరబడటం ఆగిపోకుండానే.. ఇరుదేశాల సరిహద్దుల్లో మిలటరీ రహిత ప్రాంతానికి సంబందించిన విశేషాలు బయటపడి ఆసక
భారత్, చైనాల మధ్య సిక్కింలోని డోక్లాంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే, డ్రాగన్ సైనికులు మన భూభాగంలోకి చొరబడటం ఆగిపోకుండానే.. ఇరుదేశాల సరిహద్దుల్లో మిలటరీ రహిత ప్రాంతానికి సంబందించిన విశేషాలు బయటపడి ఆసక్తి గొలుపుతున్నాయి. దశాబ్దాలుగా ఇక్కడ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. 1958లో ఈ ప్రాంతంలో ఇరుపక్షాలూ తమ బలగాలను మోహరించరాదని ఇరుదేశాలూ నిర్ణయించాయట. 1962 యుద్ధం తర్వాత ఐటీబీటీ జవాన్లు ఆయుధాలు పట్టుకుని అక్కడ తిరిగినా తుపాకులను నేలమీదకు దించే ఉండాలని ఆదేశించారు.
తర్వాత సరిహద్దు వివాద పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో భాగంగా జవాన్లు అసలు ఆయుధాలే తీసుకెళ్లకుండా ఉండటానికి భారత్ 2000 జూన్‌లో అంగీకరించింది. దీంతో ఇరుదేశాల సైనికులూ ఉన్నప్పటికీ భారత పశువుల కాపర్లూ, టిబెట్ పశువుల కాపర్లూ తమ పశువులను మేపడానికి ఇక్కడి పచ్చికబయళ్లకు తీసుకొస్తుంటారని సమాచారం.
ఇలా ఎక్కడ జరుగుతోందంటారా? పచ్చిక బీడు ప్రాంతమైన 80 చదరపు కిలోమీటర్ల బారాహోతి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు సుమారు 140 కి.మీల దూరంలో ఉంది. ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో కూడిన ‘మిడిల్ సెక్టార్’లోని మూడు పోస్టుల్లో ఇదీ ఒకటి. భారత్, చైనా సరిహద్దు రేఖ అయిన మెక్‌మోహన్ రేఖ బారాహోతి గుండా పోతుంది.
ఈ ప్రాంతాన్ని మిలిటరీ రహిత ప్రాంతంగా ప్రకటించడంతో ఇక్కడ ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసులు(ఐటీబీపీ) ఆయుధాలు లేకుండా మఫ్టీలోనే గస్తీ కాస్తున్నారు. 1958లో భారత్, చైనాలు బారాహోతిని వివాదాస్పద ప్రాంతంగా ప్రకటిస్తూ ఇరు దేశాల్లో ఎవరూ కూడా తమ బలగాలను అక్కడ మోహరించరాదని నిర్ణయించాయి.
అయితే 1962 యుద్ధం తరువాత ఐటీబీపీ జవాన్లు ఆయుధాలు తమ వెంట తీసుకెళ్లడానికి అనుమతించినా, వాటి వాడకంపై కఠిన నిబంధనలు విధించారు. తుపాకులను నేలకు దించే ఉంచాలని సూచించారు. సరిహద్దు వివాద పరిష్కారం కోసం జరిగిన చర్చల్లో భాగంగా జవాన్లు అసలు ఆయుధాలే తీసుకెళ్లకుండా ఉండటానికి భారత్ 2000 జూన్‌లో అంగీకరించింది. సరిహద్దు గ్రామాల నుంచి భారత పశువుల కాపర్లు, పొరుగున ఉన్న టిబెట్ ప్రజలు తమ పశువులను మేపడానికి బారాహోతి పచ్చిక బయళ్లకు తీసుకొస్తారు.
ఇరుదేశాల మధ్య డోక్లాం ప్రాంతంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా బారాహోతి ప్రాంతం పరమ ప్రశాంతంగా ఉండడం సంతోషించదగిన విషయమే కదా.