Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈమె నా భార్య... అమ్మాయి దొరక్క రోబోను పెళ్లి చేసుకున్న చైనా ఇంజనీర్...

ప్రస్తుతం అబ్బాయిలకు పెళ్ళి చేసేందుకు అమ్మాయిలు దొరగడం లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల కొరత తీవ్రంగా ఉండటమే. దీనికితోడు అబ్బాయిలు తిరుగుబోతులుగా మారడంతో అమ్మాయిలను ఇచ్చేందుకు తల్లిదండ్రు

ఈమె నా భార్య... అమ్మాయి దొరక్క రోబోను పెళ్లి చేసుకున్న చైనా ఇంజనీర్...
, మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (14:35 IST)
ప్రస్తుతం అబ్బాయిలకు పెళ్ళి చేసేందుకు అమ్మాయిలు దొరగడం లేదు. దీనికి కారణం ప్రపంచ వ్యాప్తంగా అమ్మాయిల కొరత తీవ్రంగా ఉండటమే. దీనికితోడు అబ్బాయిలు తిరుగుబోతులుగా మారడంతో అమ్మాయిలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో... ఓ చైనీయుడు తన కోర్కెను రోబోతో తీర్చుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆశను రోబో మహిళ ద్వారా నెరవేర్చుకున్నాడు. 
 
చైనాకి చెందిన చెంగ్‌ అనే యువకుడు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఓ అమ్మాయి కోసం తనకు తెలిసిన చోటంతా ఆరా తీశాడు. ఎంత వేచి చూసినా అతనికి నచ్చిన అమ్మాయి తారసపడలేదు. దాంతో విసిగిపోయి ఓ రోబోని పెళ్లి చేసుకోవాలన్న బలమైన నిర్ణయానికి వచ్చాడు. 
 
అతని నిర్ణయం మేరకు.. సొంతంగా ఓ రోబో తయారుచేసుకున్నాడు. దానికి యింగ్‌ అని పేరుపెట్టాడు. రోబోని పెళ్లి కూతురిలా తయారుచేసి ఓ చిన్న వేడుకలో చెంగ్‌ రోబోని తల్లిదండ్రులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృష్ణుడు రోమియో వ్యాఖ్యలు : క్షమాపణలు చెప్పిన ప్రశాంత్ భూషణ్