Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వికటించిన చైనా సంప్రదాయ వైద్యం.. వర్ధమాన నటి మృతి

చైనా సంప్రదాయ వైద్యం వికటించి ఆ దేశ వర్ధమాన నటి కన్నుమూసింది. ఆ నటి పేరు జు టింగ్. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనీస్ సినీపరిశ్రమలో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న 26 ఏళ్ల జు టింగ్.. లిం

వికటించిన చైనా సంప్రదాయ వైద్యం.. వర్ధమాన నటి మృతి
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:50 IST)
చైనా సంప్రదాయ వైద్యం వికటించి ఆ దేశ వర్ధమాన నటి కన్నుమూసింది. ఆ నటి పేరు జు టింగ్. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనీస్ సినీపరిశ్రమలో వర్ధమాన నటిగా పేరు తెచ్చుకున్న 26 ఏళ్ల జు టింగ్.. లింపథిక్ క్యాన్సర్ బారిన పడింది. ఈ వ్యాధిని నయం చేయించుకునేందుకు ఆధునిక వైద్యవిధానాన్ని కాదనుకుని సంప్రదాయ చైనీస్ వైద్యవిధానాన్ని ఎంచుకుంది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. 
 
అయితే, జులై 9న తనకు క్యాన్సర్ ఉందని ట్వీట్ చేసింది. అయితే, తర్వాత కొద్ది రోజులకే 'కీమోథెరపీ అత్యంత బాధాకరం. నాకు తెలిసినవాళ్లలో క్యాన్సర్ బారిన పడిన కొద్దిమంది కీమో చేయించుకు ఎంత నరకం అనుభవించారో గుర్తుంది. అందుకే క్యాన్సర్ ఉందని తెలియగానే నేను కీమోథెరపీ కాకుండా చైనీస్ సంప్రదాయ వైద్యవిధానంలో కేన్సర్‌ను తగ్గించుకోవాలనుకున్నా' అని మరో ట్వీట్ చేశారు.
 
ఈ విధానం ద్వారా వైద్యం చేయించుకుంటూ వచ్చిన ఆమె... ఆగస్టు 18 నాటికి జు టింగ్ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. 'ఈ విధానం (చైనీస్ వైద్యం)కూడా కీమోథెరపీలా బాధాకరంగానే ఉంది' అంటూ చివరి మెసేజ్‌ను పోస్ట్ చేసిన కొద్దిరోజులకే ఆమె మృత్యువు ఒడిలోకి జారుకుంది. సెప్టెంబర్ 7న తన సహోదరి మరణించిందని, కప్పింగ్ థెరపీ, సూదులను శరీరంలోకి గుచ్చే పద్ధతి తదితర సంప్రదాయ విధానాలన్నీ బెడిసికొట్టడం వల్లే ఇలా జరిగిందని జు టింట్ సహోదరి విలేకరులకు తెలిపారు. దీంతో జు టింగ్ మరణం గురించి చైనా వ్యాప్తంగా చర్చ మొదలైంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా.. రూ.1199 రీచార్జ్‌తో అన్నీ అన్‌లిమిటెడ్