Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా.. రూ.1199 రీచార్జ్‌తో అన్నీ అన్‌లిమిటెడ్

దేశ టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జీయో సేవలు ప్రారంభమైన తర్వాత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థల మధ్య ధరల పోటీ తీవ్రమైంది. ఇందులోభాగంగా ప్రభుత్వ రంగ టె

బీఎస్ఎన్ఎల్ బంపర్ బొనాంజా.. రూ.1199 రీచార్జ్‌తో అన్నీ అన్‌లిమిటెడ్
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (17:11 IST)
దేశ టెలికామ్ రంగంలోకి రిలయన్స్ జీయో సేవలు ప్రారంభమైన తర్వాత విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ టెలికామ్ సంస్థల మధ్య ధరల పోటీ తీవ్రమైంది. ఇందులోభాగంగా ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 
 
నెలకు రూ.1199 చార్జ్‌తో డేటా, వాయిస్ కాల్స్ అన్ లిమిటెడ్ అంటూ బంపర్ బొనాంజా ఆఫర్ ప్రకటించింది. దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్, ఉచిత డేటాను అఫర్ చేస్తోంది. 'బీబీజీ కాంబో ప్లాన్'  పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌లో వినియోగదారులు నెలకు రూ.1199  దేశంలో లోకల్, ఎస్టీడీ కాల్స్ 24 గంటలు ఉచితం, దీంతోపాటు అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ అందిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆధార్ కార్డు ఉంటే.. యాపిల్ ఐఫోన్ 7 రూ.1700లకే..? నిజమా?