కారు టాప్ మీద కూర్చుని జర్నీ చేసిన చైనా యువతి.. (వీడియో)
తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువతి దుస్సాహసం చేసింది. 70 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు టాప్ మీద హాయిగా కూర్చొని ప్రయాణం చేసింది. రోడ్డుపక్కన ఉన్న
నేటితరం యువత ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని కోరుకుంటోంది. తాజాగా రోడ్డుపై అందరిలా ప్రయాణం చేస్తే తమ స్పెషాలిటీ ఏముంటుందని అనుకున్న ఓ యువతి కారు టాప్ మీద హాయిగా కూర్చుని ప్రయాణం సాగించింది.
ఏదైనా కొత్తగా ట్రై చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని అలవాటుగా పెట్టుకున్న నేటితరం యువత.. సెల్ఫీలు, ఫోటోలతో పాటు వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్లకు బాగా మరిగారు.
తాజాగా సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే ఆకాంక్షతో.. చైనాలోని నంగ్జియాలో ఓ యువతి దుస్సాహసం చేసింది.
70 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న కారు టాప్ మీద హాయిగా కూర్చొని ప్రయాణం చేసింది. రోడ్డుపక్కన ఉన్నవారు, వేరే వాహనాలపై వెళుతున్న వారు ఆమెను చూసి షాక్ అయ్యారు. అయినప్పటికీ ఆమె నవ్వుతూ ఫోజులిస్తూ.. తన జర్నీని కొనసాగించింది. ఈ దృశ్యాలను తమ కెమెరాలో బంధించిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరకు ఆ వీడియో పోలీసుల వద్దకు వెళ్లడంతో ఆమె ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిందని ఫైన్ వేశారు.