Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చైనా రక్షణ మంత్రి అదృశ్యం... డ్రాగన్ కంట్రీలో కలకలం

Li Shangfu
, ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (13:15 IST)
చైనా రక్షణ మంత్రి  లీ షాంగ్‌వూ అదృశ్యమయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా రక్షణ సైనికాధికారుల సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఆకస్మికంగా తెరమరుగు కావడం ఇపుడు డ్రాగన్ కంట్రీలో కలకలం రేగింది. పైగా, త్వరలోనే ఆయన పదవీచ్యుతుడు కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆయన కనిపించకుండా పోవడం గమనార్హం. గత మే నెలలో ఇలాగే ఆకస్మికంగా తెర వెనక్కు వెళ్లిపోయిన ఆ దేశ విదేశాంగ మంత్రి కిన్ కాంగ్ ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఆయన బాధ్యతలను గతంలో విదేశాంగ శాఖ నిర్వహించిన వాంగ్ యీకి అధ్యక్షుడు జిన్ పింగ్ కట్టబెట్టాడు. దీంతో ఇపుడు రక్షణ శాఖ మంత్రి బాధ్యతలను కూడా ఎవరికి కట్టబెడుతారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 
 
గత శుక్రవారం అధ్యక్షుడు జిన్ పింగ్ నేతృత్వంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశాలకు కూడా రక్షణ మంత్రి హాజరుకాలేదు. అంతేకాకుండా ఈ నెల 7, 8 తేదీల్లో వియత్నాం రక్షణ అధికారులతో జరిగిన సమావేంలోనూ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పదవి కోల్పోవడం ఖాయమేనని ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. ఇటీవలికాలంలో చైనాలో పలువురు మంత్రులు, ప్రముఖులు ఆకస్మికంగా తన ప్రాముఖ్యాన్ని కోల్పోయి తెరమరుగవుతున్న విషయం తెల్సిందే. అలాంటి వారిలో ఇపుడు రక్షణ శాఖామంత్రి కూడా చేరే అవకాశాలు లేకపోలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సనత్ నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం : క్యాంటీన్‌లో యువతిపై అత్యాచారం