కరోనా వైరస్ నేపథ్యంలో భారత్‌కు సాయం చేసేందుకు డ్రాగన్ కంట్రీ ముందుకొచ్చింది. చైనాలో దాదాపు 81 వేల మంది వైరస్ బారిన పడగా, 3,200 మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నెల ఆరంభంలో చైనాకు ఇండియా నుంచి 15 టన్నుల వైద్య పరికరాలు వెళ్లాయి. మాస్క్‌లు, గ్లవ్స్, అత్యవసర ఔషధాలను భారత్ పంపింది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన జీ రాంగ్, భారత ప్రజలు చైనాకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా భారతీయులు ఈ వైరస్‌పై విజయం సాధిస్తారన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఇంకా భారత్‌కు సాయం చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించింది. భారత్‌కు ఎలాంటి అవసరం వచ్చినా సాయం చేస్తామని తెలిపారు.
మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇకపై సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ శాస్త్రవేత్త అభిప్రాయపడుతున్నారు. అలా జరిగితే నష్టం అధికంగా ఉంటుందని, వెంటనే వ్యాక్సిన్‌తో పాటు సమర్థవంతంమైన చికిత్స విధానాలను కనుగొనాలని చెప్పారు.