Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొద్దింకలంటే అసహ్యంచుకుంటే ఏం లాభం.. వాటిని పెంచితే కోట్లు వస్తాయిగా అంటున్న ఆ దొడ్డ దేశం

బొద్దింక అంటే భారతదేశ ప్రజలకు ఉన్నంత అసహ్య భావం మరే దేశానికి ఉండకపోవచ్చు. కానీ బొద్దింకలు చూసి భయపడేవారని, అసహ్యించుకునేవారిని చూసి జాలిపడండి.. కోట్లు సంపాదించే మార్గం పాపం వాళ్లకు తెలీదు అంటున్నారు చైనా వాళ్లు. వీల్లు సామాన్యులు కాదు అని నవ్వకండి. ఎ

బొద్దింకలంటే అసహ్యంచుకుంటే ఏం లాభం.. వాటిని పెంచితే కోట్లు వస్తాయిగా అంటున్న ఆ దొడ్డ దేశం
హైదరాబాద్ , మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (02:44 IST)
బొద్దింక అంటే భారతదేశ ప్రజలకు ఉన్నంత అసహ్య భావం మరే దేశానికి ఉండకపోవచ్చు. కానీ బొద్దింకలు చూసి భయపడేవారని, అసహ్యించుకునేవారిని చూసి జాలిపడండి.. కోట్లు సంపాదించే మార్గం పాపం వాళ్లకు తెలీదు అంటున్నారు చైనా వాళ్లు. వీల్లు సామాన్యులు కాదు అని నవ్వకండి. ఎందుకంటే ప్రపంచంలోనే బొద్దింకల పరిశ్రమలను అభివృద్ది చేస్తూ భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్న దేశం చైనాయే మరి. పది లక్షల బొద్దింకలు మనకు చేరువలో ఉంటే ఒళ్లంతా గొంగడిపురుగులు పాకినట్లుంటుంది కదా. కానీ మావద్ద ఉంటే లాఫింగ్ బుద్దా మా ఇంట్లోకి గునగునా నడుచుకుంటూ వచ్చినట్లే అంటున్నారు చైనీయులు. నవ్వే బుద్దుడు అదృష్టానికి చిహ్నమని కొన్ని ఆసియా దేశాల నమ్మిక.
 
ఇంతకూ విషయం ఏమిటంటే.. చైనాలో అనేకమంది బొద్దింకల పెంపకాన్ని చేపడుతున్నారు. ఒకటీ రెండూ కాదు. ఒకే చోట ఒక్కొక్కరు పది లక్షల బొద్దెంకలను పెంచుతున్నారు. ఎదుకంటే బొద్దింకలు చైనాలో భారీ ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. బొద్దింకల్ని పలు ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు. గుండె జబ్బులు, టీబీ, రక్త నాళాలకు సంబంధించిన జబ్బుల నివారణకు ఉపయోగపడే ఔషధాల తయారీలో బొద్దింకలు ఉపయోగపడుతున్నాయి.
 
పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉండడంతో చైనాలో బొద్దింకల పెంపకం మంచి లాభాసాటిగా మారింది. లక్షల సంఖ్యలో బొద్దింకల్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల అక్కడ వీటిని ఆహారంగా కూడా తీసుకుంటున్నారు. అందుకే ఈసారి బొద్దింకను చూస్తే హడలి చావకండి. ఎందుకంటే అది బంగారు పెట్టే బాతుగుడ్డు మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్త మరణవార్తనే చదివిన న్యూస్ రీడర్ ఎక్కడ? గోర్లు గిల్లుకుంటూ దొరికిపోయిన నటాషా ఎక్కడ?