Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నతల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో, అల్మారాల్లో?

కన్నతల్లిని హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. ఫ్రిజ్‌లో, అల్మారాల్లో?
, శనివారం, 8 మే 2021 (14:55 IST)
కన్నతల్లిని కిరాతకంగా హతమార్చాడు ఒక కర్కశుడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలుగా కోసి పీక్కుతిన్నాడు. ఈ దుర్ఘటన స్పెయిన్‌లో జరిగింది. కన్న తల్లిని చంపడమే కాకుండా ఆమెను చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా నరికాడు మాడ్రిడ్‌కు చెందిన ఆల్బెర్టో శాంచేజ్ గోమెజ్(28).
 
వివరాల్లోకి వెళ్తే.. తల్లి మారియా సోలిడాడ్ గోమేజ్(68)ను ఆమె ఇంటి వద్దే గోంతుకోసి చంపేశాడు గోమెజ్. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. వాటిని తినడంతో పాటు, కొన్నింటిని తన పెంపుడు కుక్కకు విసిరాడు. మిగిలిన వాటిని ఫ్రిజ్‌లో, అల్మారాల్లో నిల్వచేసుకొని తిన్నాడు. ఈ ఘటన 2019లో వెలుగుచూసింది. ఆ తరువాత గోమేజ్‌ను నరమాంస భక్షకుడిగా పిలుస్తున్నారు స్థానికులు. ఏ పనీ చేయని నిందితుడు.. మానసిక వ్యాధితో బాధపడుతున్నానని వారు చెబుతున్నాడు.
 
రెండేళ్ల క్రితం మారియా సోలిడాడ్ నెల రోజులగా కనిపించట్లేదని ఆమె స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. విచారణ సందర్భంగా ఈ దారుణం బయటపడింది. ఫిబ్రవరి 2019లో తన తల్లిని చంపి, తిన్నానని గోమెజ్ పోలీసుల ముందు చెప్పాడు. అధికారులు అతడి ఫ్రిజ్ నుంచి ఎముకలను సేకరించారు. మాడ్రిడ్‌లోని లాస్ వెంటాస్ బుల్లింగ్ సమీపంలో ఉన్న అపార్ట్మెంట్ మంచం మీద మృతురాలి తల, చేతులు, గుండె కనిపించాయి. ఆమె మృతదేహాన్ని 1000 కంటే ఎక్కువ చిన్న ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది.
 
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, అతడిని కోర్టులో హాజరుపరిచారు. గతంలోనూ మాదకద్రవ్యాల కేసులో అతడు పోలీసులకు చిక్కాడు. దురుసుగా ప్రవర్తించిన నేరానికి 12 సార్లు అరెస్టు అయ్యాడు. అంతేకాకుండా చాలా సార్లు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించాడు. విచారణలో మరికొన్ని విషయాలను కూడా చెప్పాడని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తన తల్లిని వెనుక నుంచి పట్టుకొని గోంతు కోశాడని, ఆమె శరీర భాగాలను కొన్ని వండి, మరికొన్నింటిని పచ్చిగా తిన్నట్లు అంగీకరించినట్లు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి రద్దు చేసుకున్న మహిళా వైద్యురాలు.. ఎందుకో తెలుసా..?