Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగి దానం చేశాడు.. అతడు ఏం చేశాడంటే?

కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగి దానం చేశాడు. ఆ దానం ఏంటంటే..? ఓ రోగి తనకు ఏడాదిపాటు బహుమతిగా వచ్చిన పిజ్జాలను ఫుడ్ బ్యాంకుకు దానంగా ఇచ్చిన సంఘటన పెన్సిల్వేనియా దేశంలో జరిగింది. పెన్సిల్వేనియా దేశం

Advertiesment
Cancer patient donates year's worth of pizza to food bank
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:23 IST)
కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగి దానం చేశాడు. ఆ దానం ఏంటంటే..? ఓ రోగి తనకు ఏడాదిపాటు బహుమతిగా వచ్చిన పిజ్జాలను ఫుడ్ బ్యాంకుకు దానంగా ఇచ్చిన సంఘటన పెన్సిల్వేనియా దేశంలో జరిగింది. పెన్సిల్వేనియా దేశంలోని నార్తంటన్ నగరానికి చెందిన 36 ఏళ్ల జోష్ కాట్రిక్ పెద్దపేగు కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను 8వసారి కీమోథెరపీ చికిత్స చేయించుకుంటున్నాడు.
 
అంతలో నైబర్ హుడ్ రెస్టారెంట్ వారు నిర్వహించిన పిజ్జాల పోటీలో కాట్రిక్‌కు బహుమతి వచ్చింది. 1200 మంది పాల్గొన్న పిజ్జా పోటీల్లో కేన్సర్ రోగికి బహుమతి దక్కడం విశేషం. ఈ బహుమతి కింద ఏడాది పాటు పిజ్జాలను ఉచితంగా కాట్రిక్‌కు అందిస్తామని ప్రకటించారు. 
 
అంతే కేన్సర్ రోగి అయిన కాట్రిక్ తనకు బహుమతిగా వచ్చిన పిజ్జాలను నార్తంటన్ ఫుడ్ బ్యాంకుకు దానంగా ఇచ్చాడు. దీంతో మారియో పిజ్జా రెస్టారెంట్ యజమాని తాము బహుమతిని రెట్టింపు చేసి ఏడాది పాటు కాట్రిక్‌తో పాటు ఫుడ్ బ్యాంకుకు కూడా పిజ్జాలను అందిస్తామని ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను బరిలోవుండి ఉంటే ట్రంప్‌ను ఓడిచేవాడినే.. బరాక్ ఒబామా