భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో నిందితుడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో లేడని, అవన్నీ అవాస్తవమైన వ్యాఖ్యలని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్లా బసిత్ వెల్లడించారు. కరాచీలోని క్రిప్టన్ ప్రాంతంలో దావూద్ తలదాచుకున్నట్లు వస్తున్న వార్తలొచ్చిన నేపథ్యంలో, వాటిలో అవాస్తవాలు లేవన్నారు. దావూద్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని, లేనివాడిని ఎక్కడి నుంచి తెచ్చి భారత్‌కు అప్పగించాలని బసిత్ ప్రశ్నించారు.
దావూద్‌ను భారత్‌కు అప్పగించేందుకు పాక్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో పాటు దావూద్ ఇంటి నుంచి మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేకు తరచూ పోన్స్ వస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వార్తల నేపథ్యంలో ఏక్‌నాథ్ ఖడ్సే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.