Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ రాజుకు 100 మంది భార్యలు.. 500 మంది పిల్లలు... ఏ దేశంలో?

ఒక రాజుకు వంద మంది భార్యలు... వెయ్యి మంది పిల్లలని. ఇది చిన్నపుడెపుడో పాఠాల్లో చదువుకునివుంటాం. కానీ ఇపుడిది నిజం. ఆ రాజుకు అక్షరాలా వందమంది భార్యలు. ఆ దేశం పేరు కామరూన్.

Advertiesment
Cameroon's king
, బుధవారం, 17 ఆగస్టు 2016 (15:59 IST)
ఒక రాజుకు వంద మంది భార్యలు... వెయ్యి మంది పిల్లలని. ఇది చిన్నపుడెపుడో పాఠాల్లో చదువుకునివుంటాం. కానీ ఇపుడిది నిజం. ఆ రాజుకు అక్షరాలా వందమంది భార్యలు. ఆ దేశం పేరు కామరూన్. ఇక్కడ ఇప్పటికీ రాచరిక వ్యవస్థ ఉంది. బ‌ఫూట్ సంస్థానానికి అధిప‌తి రెండ‌వ అబుంబి. ఈయన వయసు 47 యేళ్లు. ఆ రాచ‌రిక వ్య‌వ‌స్థ‌కు అత‌ను 11వ చ‌క్ర‌వ‌ర్తి. కామ‌రూన్‌లో రాజుల‌ను ఫాన్ అని పిలుస్తారు. 
 
11వ ఫాన్‌గా సంస్థానాన్ని పాలిస్తున్న ఆ రాజుకు సుమారు 100 మంది భార్య‌లు. అయితే, ఈయనగారు అంత మందిని పెళ్లి చేసుకోలేదు. అక్క‌డి సంప్ర‌దాయం, ఆచారం ప్ర‌కారం మాజీ చ‌క్ర‌వ‌ర్త‌ుల ఆస్తులు ప్ర‌స్తుత రాజుల‌కు సంక్ర‌మిస్తాయి. మాజీ రాజుల స‌తీమ‌ణులు కూడా ప్ర‌స్తుత చ‌క్ర‌వ‌ర్తుల‌కు భార్య‌లుగా మారిపోతారు. 
 
ఆచారం ప్ర‌కారం భార్య‌లు సంక్ర‌మించినా, కొత్త‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన చ‌క్ర‌వ‌ర్తి త‌న‌కు న‌చ్చిన‌వాళ్లను కూడా పెళ్లి చేసుకునే వీలుంటుంది. అలా చేయ‌డం వ‌ల్లే రెండవ అబుంబి ఖాతాలో వంద మంది భార్య‌లు చేరిపోయారు. ఆస్తిగా సంక్ర‌మించిన మాజీ భార్య‌లు రాజ్య ప‌రిపాల‌న‌లో చ‌క్ర‌వ‌ర్తికి స‌హ‌క‌రిస్తారు. త‌మ అనుభ‌వాల‌ను, ఐడియాల‌ను కూడా వాళ్లు పంచుకుంటారు. ఎందుకంటే యువ‌రాజు స్థానం నుంచి రాజుగా మారిన వ్య‌క్తికి ప‌రిపాల‌నా అనుభ‌వాల‌ను నేర్పాల్సిన అవ‌స‌రం రాజుగారి మాజీ భార్యలపైనే ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవితంపై విరక్తి చెందా.. నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్య