Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దోపిడీకి వచ్చి వృద్ధురాలికి ముద్దుపెట్టిన దొంగ

Advertiesment
దోపిడీకి వచ్చి వృద్ధురాలికి ముద్దుపెట్టిన దొంగ
, శనివారం, 19 అక్టోబరు 2019 (13:43 IST)
ఈ వివరాలను పరిశీలిస్తే, బ్రెజిల్‌ దేశంలోని అమరాంటేలో ఉన్న ఓ ఫార్మసీ షాపులోకి హెల్మెట్లు ధరించిన ఇద్దరు ముసుగు దొంగలు ప్రవేశించారు. లోపల ఉన్న కస్టమర్లను తమ వద్ద గన్‌లతో బెదిరించారు. షాపు యజమానితోపాటు అందరి వద్ద ఉన్న డబ్బు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు.
 
దోపిడీకి వచ్చిన దొంగలు ఆ షాపులో అందరిపట్లా కఠినంగా వ్యవహరించి వారి వద్ద ఉన్నవి దోచుకున్నారు. ఆ షాపులో ఓ వృద్ధురాలు కూడా ఆ సమయంలో ఉన్నది. కానీ, ఆమెను మాత్రం ఏం చేయకుండా వదిలేశారు. పైగా ఆమె సొత్తు ఇస్తుంటే ఓ దొంగ ఆమె నుదుటిపై ముద్దిచ్చాడు. షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఈ దృశ్యం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విశేషంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రో జర్నీ కాదు.. మృత్యు ప్రయాణం ... పట్టుకుంటే ఊడివచ్చిన రోప్ క్యాబిన్