భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న గొడవలు విడాకులకు దారి తీస్తున్నాయి. తాజాగా బర్గర్ తీసుకురాలేదని ఓ మహిళ భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడింది. అబుదాబిలో ఇది జరిగింది.
ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ తన భర్తను ఇంటికి తిరిగివచ్చేటప్పుడు బర్గర్ మీల్ తీసుకురమ్మంది. స్నేహితులతో మచ్చట్లు చెప్పుకుంటూ భర్త రెస్టారెంట్‌కు వెళ్లడం మరచిపోయి తెల్లవారుజామున 3 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కాస్త విడాకులకు దారి తీసింది.
విడాకులకు దరఖాస్తు చేసుకున్న మహిళకు, ఆమె భర్తకు జడ్జి ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని లాయర్ పేర్కొన్నారు. సమస్య పరిష్కారమైతే వారిద్దరూ భార్యాభర్తలుగా కొనసాగుతారు. అలా కాని పక్షంలో ఆమె కోరుకున్నట్టుగా విడాకులు తీసుకోవచ్చన్నారు.