Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ భార్య అంత పనిచేసిందా..? వివాదం మామూలుగా లేదుగా!

బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ భార్య అంత పనిచేసిందా..? వివాదం మామూలుగా లేదుగా!
, సోమవారం, 15 మార్చి 2021 (13:50 IST)
క్వీన్ ఎలిజబెత్ II మనవడు హ్యారీ, అతని భార్య మేఘన్ గత ఏడాది మార్చిలో ఫ్రంట్‌లైన్ రాయల్ డ్యూటీని విడిచిపెట్టి కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, డచెస్ ఆఫ్ సస్సెక్స్ రాజ బిరుదులను వదిలివేస్తున్నట్లు గత ఏడాది జనవరిలో వీరిద్దరూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ మెర్కెల్ వివాదంలో చిక్కుకున్నారు. 
 
బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో తాను మేఘన్ మెర్కెల్ ద్వారా చాలా మానసిక వేదన అనుభవించానని ఇటీవల ఒప్రా విన్‌ఫ్రే అనే ప్యాలెస్ కార్మికులు ఆరోపించి సంచలనం సృష్టించారు. దీంతో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ కార్మికులను వేధించారన్న ఆరోపణలపై న్యాయ సంస్థ దర్యాప్తు జరిపేందుకు సిద్ధమైంది. బ్రిటిష్ మీడియా ఈ విషయాన్ని పేర్కొంది. 
 
ఈ నెల ప్రారంభంలో ప్యాలెస్‌పై ఆరోపణల కేసును దర్యాప్తు చేస్తామని ధ్రువీకరించింది. ఈ విషయాన్ని అంతర్గతంగా చర్చిస్తామని బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ఇప్పటికే ప్రకటించింది. అయితే, మెర్కెల్‌పై వచ్చిన ఆరోపణలపై బయటి న్యాయ సంస్థతో దర్యాప్తు చేయించేందుకు రాజకుటుంబం నిర్ణయించిందని బ్రిటిష్‌ మీడియాలో కథనాలు వచ్చాయి. మేఘన్‌పై ఫిర్యాదు 2018 అక్టోబర్ నాటిది. అప్పుడు ఒక ఉద్యోగి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఈ-మెయిల్ హెచ్‌ఆర్ విభాగానికి పంపించారు. కాని ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోలేదు.
 
ఉద్యోగి లీక్ చేసిన ఈ-మెయిల్‌ను టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. అమెరికన్‌ మాజీ నటి అయితన మేఘన్.. తన ఇద్దరు వ్యక్తిగత సహాయకులను ప్యాలెస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని బలవంతం చేశారని ఆరోపణలు వచ్చాయి. మరో ఉద్యోగి నమ్మకాన్ని బలహీనం చేసేలా మేఘన్ ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు, ది సండే టైమ్స్ వార్తల ప్రకారం.. ఈ కేసును న్యాయమైన దర్యాప్తు కోసం న్యాయ సంస్థకు పంపాలని నిర్ణయించారు. 
 
ప్యాలెస్ ప్రతినిధులు దీనిపై స్పందించడానికి నిరాకరించారు. 'మేఘన్ వద్ద పనిచేసిన ఉద్యోగి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఆ దిశగా పయనిస్తున్నాం. కాని, బహిరంగంగా వ్యాఖ్యానించలేం' అని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. 
 
అంతేగాకుండా ఒప్రా విన్‌ఫ్రే ఇంటర్వ్యూలో మేఘన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. బకింగ్‌హామ్ ప్యాలెస్ రంగు ఆధారంగా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాజ కుటుంబంలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని చెప్పారు. తమ కుమారుడు ఆర్చీ రంగు గురించి రాజ కుటుంబం ఆందోళన చెందిందని తెలిపారు. అయితే, ఎవరి పేరును ఉటంకించకుండా ఈ ఆరోపణలు చేయడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశపు ఎలక్ట్రానిక్ వ్యర్థ సమస్యను తీర్చేందుకు ఆర్‌ఎల్‌జీ క్లీన్‌ టు గ్రీన్‌ ప్రచారం