Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటీష్ మోడల్ కేటీ సాల్మన్‌‌ను రేప్ చేసిన అభిమాని... కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి పని పూర్తిచేశాడు...

బ్రిటీష్ డేటింగ్ రియాల్టీ షో 'లవ్ ఐలాండ్' స్టార్, బ్రిటీష్ మోడల్ కేటీ సాల్మన్ ఓ అభిమాని చేతిలో తన శీలాన్ని కోల్పోయింది. ఆ అభిమాని నమ్మించి.. మత్తుమందిచ్చి తన పని పూర్తి చేశాడు. తాజాగా లండన్‌లో ఓ అభిమా

Advertiesment
british model Katie Selman
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:46 IST)
బ్రిటీష్ డేటింగ్ రియాల్టీ షో 'లవ్ ఐలాండ్' స్టార్, బ్రిటీష్ మోడల్ కేటీ సాల్మన్ ఓ అభిమాని చేతిలో తన శీలాన్ని కోల్పోయింది. ఆ అభిమాని నమ్మించి.. మత్తుమందిచ్చి తన పని పూర్తి చేశాడు. తాజాగా లండన్‌లో ఓ అభిమాని ఏకంగా స్టార్‌ సెలబ్రిటీని రేప్ చేసిన సంఘటన అక్కడ సంచలనం కలిగిస్తోంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
లండన్‌లో ప్రముఖ పత్రికైన ‘ది సన్’ పత్రిక కథనం ప్రకారం మోడల్ కేటీ సాల్మన్ మంగళవారం రాత్రి తన ఫ్రెండ్స్‌‌తో పాటు నైట్ క్లబ్‌కు వచ్చింది. అక్కడ డేనియల్ అనే వ్యక్తి నేను మీ అభిమానిని అంటూ కేటీ సాల్మన్‌తో కరచాలనం చేసి ఆమెతో మాటలు కలిపాడు. అభిమానే కదా అని ఆమె కూడా కాస్త చనువు ఇవ్వడంతో ఇద్దరి మధ్య కొంతసేపు మాటలు సాగాయి. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తాపీగా మందు కొట్టారు. 
 
అలా కొంత సమయం గడిచిన తర్వాత ఆమెకు కూల్‌డ్రింక్ అందించాడు. అందులో ఆమెకు తెలియకుండా డ్రగ్స్(మత్తు మందు) కలిపినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ ఎఫెక్టుతో ఆమె మత్తులోకి వెళ్లిపోయింది. ఆమె మత్తు నుండి తేరుకునే సమయానికే జరగాల్సిందంతా జరిగిపోయింది. మెలకువ వచ్చే సమయానికి తెల్లవారుజామున నైట్ క్లబ్‌కు కొంతదూరంలో గాయాలపాలై, తాను అత్యాచారానికి గురైనట్లు ఉన్న ఆనవాళ్ళతో తన స్థితిని చూసి ఆమె షాకైంది. 
 
పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం కేటీ సాల్మన్, ఆమె స్నేహితురాలు, డేనియల్ కలిసి అర్థరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో నైట్ క్లబ్ నుంచి బయటికి వెళ్లిపోయినట్లు సీసీ టీవీల్లో రికార్డయింది. కేటీ సాల్మన్ అతనితో ఉండటంతో స్నేహితురాలు జెస్సికా అక్కడి నుండి వెళ్లిపోయింది. అభిమాని అని చెప్పి మత్తు మందు కలిపి అత్యాచారం చేయడమే కాక ఆమె హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోన్ కూడా డానియేల్ చోరీ చేసుకుని వెళ్లిపోయాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియోకు ట్రాయ్ షాక్... ఉచిత కాలింగ్ ఆఫ‌ర్ మ‌ర్మం ఏంటి? ఎలా ఇస్తున్నారు...?