గర్భం దాల్చిన ఒక్క మగాడు..
మహాభారతంలో కౌరవులకు గాంధారి జన్మనిచ్చిన వృత్తాంతం మనందరికీ తెలుసు. కౌరవులు స్త్రీ గర్భం నుంచి కాకుండా కుండలోంచి పుట్టారని కదా పురాణం. ఇది కల్పనో, నిజమో తెలీదు కానీ ఈ ఆధునిక యుగంలో కుండలో దానం చేసిన వీర్యం సహాయంతో ఒక బ్రిటిష్ మగాడు బిడ్డకు జన్మనివ్వడం
మహాభారతంలో కౌరవులకు గాంధారి జన్మనిచ్చిన వృత్తాంతం మనందరికీ తెలుసు. కౌరవులు స్త్రీ గర్భం నుంచి కాకుండా కుండలోంచి పుట్టారని కదా పురాణం. ఇది కల్పనో, నిజమో తెలీదు కానీ ఈ ఆధునిక యుగంలో కుండలో దానం చేసిన వీర్యం సహాయంతో ఒక బ్రిటిష్ మగాడు బిడ్డకు జన్మనివ్వడం సంభవమవుతోంది. అసలు విషయంలోకి వస్తే...
ఆమె మహిళగా జన్మించింది. మగాడిగా మారాలని నిర్ణయించుకుంది. లింగమార్పిడి ప్రక్రియలోకి అడుగుపెట్టింది. కానీ మధ్యలో బిడ్డను కనాలని కోరిక పుట్టింది. దాంతో లింగమార్పిడి ప్రక్రియను వాయిదా వేసుకుంది. ఇప్పుడు బిడ్డను కనబోతున్న తొలి బ్రిటన్ మగాడిగా చరిత్రకెక్కంది. సోషల్ మీడియా వేదిక ద్వారా వీర్యదాత ఒకరు ఆమెకు వీర్యం డొనేట్ చేయడమే దీనంతటికీ కారణం అంటే ఆశ్చర్యం కలుగవచ్చు. కానీ ఇది నిజం.
ఈ సంచలనానికి కారణమైన వ్యక్తి పేరు హెడెన్ క్రాస్. లింగమార్పిడి చేయించుకున్న బ్రిటిష్ హిజ్రా అతడు. వయస్సు 20 ఏళ్లు. గత మూడేళ్లుగా చట్టబద్దంగానే మగాడిలా జీవితం సాగిస్తున్నాడు. మహిళ నుంచి పురుషుడిగా పూర్తిగా మార్పు చెందడానికి తాను తీసుకున్న హార్మోన్ ట్రీట్‌మెంట్ ఇప్పటికే సగం పూర్తయింది. అయితే ఇప్పుడు బిడ్డను కనాలన్న కోరిక తీర్చుకోవడానికి లింగ మార్పిడి ప్రక్రియను మద్యలేనే వాయిదా వేసుకున్నాడు. బిడ్డను కన్న తర్వాతే తన శరీరంనుంచి వక్షోజాలను, బీజకోశాలను శాశ్వతంగా తొలగించుకుంటానని చెప్పుకుంటున్నాడు.
ఇంతకూ అతడి ఆదర్శం ఏమిటో తెలుసా.. మంచి బిడ్డను కనాలి. గొప్ప డాడీని కావాలి.
బ్రిటన్ లోని గ్లూసెస్టర్‌లోని ఒక కౌన్సిల్ ఫ్లాట్‌లో నివసిస్తున్న హేడెన్ నిరుద్యోగిగా ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతున్నాడు. తనలోని స్త్రీత్వాన్ని తొలగించుకుని పురుషుడిగా మారే క్రమంలో ఉన్న అతడికి ఉన్నట్లుండి బిడ్డకు జన్మ ఇవ్వాలనిపించింది. పూర్తిగా మగాడిగా మారకముందే తన అండాలను ప్రీజ్ చేయవలసిందిగా జాతీయ ఆరోగ్య సర్వీసు వారిని కోరాడు. కాని ఆ విధంగా చికిత్స చేయడానికి 4 వేల పౌండ్లు కావాలి. డాక్టర్లు అతడికి చికిత్స చేయడానికి నిరాకరించారు. దీంతో తీవ్రంగా నిరాశపడ్డ క్రాస్ వీర్యాన్ని దానం చేయగల వారికోసం సోషల్ మీడియాను మార్గంగా చేసుకున్నాడు.
ఆ తర్వాత మహాద్భుతమే జరిగింది. ఒక రోజు అతడి ఇంటికి ఒక కుండ పోస్టు ద్వారా వచ్చింది. పేరు చెప్పని ఒక వీర్యదాత తన వీర్యాన్ని ఆ కుండలో ఉంచి క్రాస్‌కు పంపాడు. అతడెవరో క్రాస్‍కు తెలీదు. డాక్టర్లు తిరస్కరించారని ఆశాభంగం చెందిన ఈ మగావిడకు పెన్నిధి దొరికినట్లయింది. క్లినిక్ వెళ్లడానికి డబ్బులు లేకపోవడంతో తనకు తానుగా సిరెంజి ద్వారా ఆ దాత వీర్యాన్ని తనలోని ఎక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే క్రాస్ గర్భం ధరించాడు.
ఆదివారం ఈ విషయాన్ని బ్రిటిష్ మీడియాకు తెలిపిన క్రాస్ తనలో మిశ్రమ భావోద్వేగాలు ఏర్పడినట్లు తెలిపాడు. గర్భం దాల్చడం సంతోషమే కానీ దీనివల్ల మగాడిగా పూర్తి మార్పిడి చెందే ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకోవలసి వచ్చిందని బాధను వ్యక్తం చేశాడు.
జాతీయ ఆరోగ్య సర్వీసు కనుక తన అండాలను శీతలీకరించ అంగీకరించి ఉంటే తాను ఎదిగి ఒకరితో సహజీవన సంబంధాన్ని కొనసాగించిన తర్వాత చాలా కాలానికి బిడ్డను కనేవాడినని హేడెన్ చెబుతున్నాడు. కానీ వారు తిరస్కరించడంతో ఇక తనకు వేరే మార్గం లేకపోయిందని తనకు నచ్చినవిధంగా బిడ్డను కన్న తర్వాత కొన్ని సంవత్సరాల వరకు తాను పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటానని చెప్పాడు.
ఇంతకూ బిడ్డను కనాలని మధ్యలో ఎందుకనిపించింది? ఒకసారి హార్మోన్ మార్పిడి చికిత్స చేయించుకుంటే మరెన్నటికీ తాను మళ్లీ స్త్రీని కాలేననిపించిందట. అందుకే లింగమార్పిడి ప్రక్రియ పూర్తి కాకముందే గర్భం దాల్చాలని మానసికంగా ఒత్తిడి పెరిగింది.
గ్లూసెస్టర్‌లో బాలికా పాఠశాలలో హెడెన్ చేరాడు. కానీ 14 ఏళ్లలో అతడిని స్కూల్ నుంచి బహిష్కరించారు. అదే సమయంలో అతడి తల్లిదండ్రులు విడిపోయారు. తాను మొదటినుంచి బైసెక్సువల్‌గానే ఉండేదాన్నని, అనేక మంది మగ స్నేహితులను సంపాదించానని, ఫుట్ బాల్ ఆడేదాన్నని హెడెన్ చెప్పింది. బైసెక్సువల్ కావటంతో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరితో డేటింగ్ చేసేదాన్నని ఎక్కువగా మగవారినే ఎంచుకునేదాన్నని చెప్పింది. గర్భధారణ సమయంలో తాను బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీసు వారి మెటర్నిటీ సేవల సలహా ప్రకారం నడుచుకుంటానని చెప్పింది.
ఇదెలా సాధ్యం అంటే సైన్స్ వివరణ ఇస్తోంది మరి. లింగమార్పిడి చేయించుకున్న మగవారు తమ గర్భాశయాన్ని, బీజకోశాలను తీసివేయించుకుండా అలాగే ఉంటుకుంటే వారికి గర్భం దాల్చే సామర్థ్యం ఉంటుందట.
ఇదీ విషయం. భారత్‌లో ఊహకు కూడా అందని పరిణామాలు పాశ్చాత్య దేశాల్లో అలవాటుగా సాగుతున్నాయి మరి.