Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పురుషుడు... ఎక్కడ?

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటి ఫేస్‌బుక్. ఈ ప్రసారమాద్యమం ద్వారా అనేక మంది యువతీయువకులు ఒక్కటవుతున్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఇలా కొన్ని కోట్ల మందిని ఒక్కటిగా చేస్తూ అనుసంధానకర్తగా ఫేస్

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన పురుషుడు... ఎక్కడ?
, ఆదివారం, 9 జులై 2017 (12:10 IST)
సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటి ఫేస్‌బుక్. ఈ ప్రసారమాద్యమం ద్వారా అనేక మంది యువతీయువకులు ఒక్కటవుతున్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తోంది. ఇలా కొన్ని కోట్ల మందిని ఒక్కటిగా చేస్తూ అనుసంధానకర్తగా ఫేస్‌బుక్ ఉంది. అంతేకాదండోయ్... ఓ పురుషుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చేందుకు కూడా దోహదపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్‌కు చెందిన 21 యేళ్ళ పురుషుడు స్త్రీ లక్షణాలతోనే జన్మించాడు. తర్వాత అతను లింగమార్పిడి చేయించుకున్నాడు. పిల్లలను కనేందుకు అతను ఫేస్‌బుక్ సాయంతో స్పెర్మ్‌డోనర్‌ కోసం గాలించాడు. ఓ రిక్వెస్ట్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన ఓ ఫేస్‌బుక్ యూజర్ తన వీర్యాన్ని దానం చేశాడు. ఈ వీర్యం సాయంతో గర్భందాల్చాడు. అతను ఆడ శిశువుకు జన్మనిచ్చాడు. ట్రినిటీ లీఫ్ అని పేరు కూడా పెట్టారు. అతని పేరు హెడెన్ క్రాస్‌.
 
కాగా, హెడన్ తన సెక్స్ మార్పిడికి హార్మోన్ థెరపీని తన 18వ ఏటనే ఆశ్రయించాడు. ఒకసారి అతను సెక్స్ థెరిపీని నిలిపివేసి, బిడ్డకు జన్మనివ్వాలనుకున్నాడు. అయితే అప్పటికే అతనికి లీగల్‌గా పురుషునిగా గుర్తింపు వచ్చింది. కానీ అతనికి పూర్తిస్థాయిలో పురుష హార్మోన్లు అందలేదు. అతను లీగల్‌గా బిడ్డను కనేందుకు స్మెర్మ్‌డోనర్‌ను వెతకాల్సి వచ్చింది. ఇందుకోసం అతను ఫేస్‌బుక్‌ను ఆశ్రయించగా, అతని కృషి ఫలించింది. హెడెన్ క్రాస్ గర్భం ధరించి.. శిశువుకు జన్మనిచ్చాడు. కాగా ఈ ఉదంతపై బ్రిటన్‌లో దుమారం చెలరేగుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లాష్.. ఫ్లాష్.. నాగాలాండ్ సీఎంపై ఎమ్మెల్యేల తిరుగుబాటు