Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అర్థనగ్న ఫోటోలు ఎఫ్‌బిలో పెట్టి... ఐసిస్‌లో చేరాలంటూ ప్రచారం.. బ్రిటన్ మోడల్ అరెస్టు

బ్రిటిష్ గ్లామర్ మోడల్ కింబర్లీ మైనర్స్‌‌‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భామ ఇటీవలే ఇస్లాం మతంలోకి మార్చుకుంది. అప్పటినుంచి ఐసిస

Advertiesment
అర్థనగ్న ఫోటోలు ఎఫ్‌బిలో పెట్టి... ఐసిస్‌లో చేరాలంటూ ప్రచారం.. బ్రిటన్ మోడల్ అరెస్టు
, సోమవారం, 10 అక్టోబరు 2016 (09:21 IST)
బ్రిటిష్ గ్లామర్ మోడల్ కింబర్లీ మైనర్స్‌‌‌కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు తేలింది. దీంతో ఆమెను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ భామ ఇటీవలే ఇస్లాం మతంలోకి మార్చుకుంది. అప్పటినుంచి ఐసిస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఐసిస్ పోస్ట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ వచ్చింది. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు... ఆమెకు పలుమార్లు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆమె మాత్రం వైఖరి మారకపోవడంతో అరెస్టు చేయక తప్పలేదు. 
 
అంతటితో ఆగని ఆమె పాపులారిటి మరింత సంపాదించుకునేందుకుగాను ఓ ప్రముఖ దినపత్రికకు గాను అర్థ నగ్నంగా పోజిచ్చింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఐసిస్‌లో చేరాలంటూ యువతను ఆకర్షించేదట. ఇలాచేస్తున్న ఈమెను బ్రిటన్‌ యాంటీ టెర్రరిస్టుగా పోలీసులు గుర్తించి ఉగ్రవాద నిరోధక చట్టం-2000 కింద ఇటీవల అరెస్ట్‌చేశారు. 
 
తన అరెస్టుపై ఆమె స్పందిస్తూ "నేను సోషల్ మీడియాలో ఐసిస్‌ను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు.. నేను తీవ్రవాదులకు వ్యతిరేకమంటూ బుకాయిస్తోందని పోలీసులకు ఆమె సమాధానం ఇచ్చినట్లు సమాచారం. నా పేరుతో ఎవరో నకిలీ అకౌంట్ తయారు చేసి నన్ను బలి చేస్తున్నారంటూ" తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ జియో వరల్డ్ రికార్డు... నెలలో 1.60 కోట్ల మంది కస్టమర్లు