Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండు నెలల నిర్బంధం.. రేప్ మీద రేప్.. చిత్రహింసలు.. కత్తిగాట్లు.. ఆమె ఇంకా బతికే ఉంది.

ఆస్ట్రేలియాలో ఓ బ్రిటన్‌కు చెందిన యువతిపై దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆమెను దాదాపు రెండు నెలలపాటు బందించి చిత్రహింసలకు గురిచేశాడు ఓ ఉన్మాది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమె శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు. నిరంతరం చావుదెబ్బలు కొడుతూ ఊపిరి ఆడకుండా

రెండు నెలల నిర్బంధం.. రేప్ మీద రేప్.. చిత్రహింసలు.. కత్తిగాట్లు.. ఆమె ఇంకా బతికే ఉంది.
హైదరాబాద్ , మంగళవారం, 7 మార్చి 2017 (09:14 IST)
ఆస్ట్రేలియాలో ఓ బ్రిటన్‌కు చెందిన యువతిపై దారుణం చోటుచేసుకుంది. 22 ఏళ్ల ఆమెను దాదాపు రెండు నెలలపాటు బందించి చిత్రహింసలకు గురిచేశాడు ఓ ఉన్మాది. లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా ఆమె శరీరంపై కత్తిగాట్లు పెట్టాడు. నిరంతరం చావుదెబ్బలు కొడుతూ ఊపిరి ఆడకుండా చేసి ఉన్మాదం చూపించాడు. మంగళవారం బాధితురాలిని ఆస్ట్రేలియా పోలీసులు ఈ ప్రమాద పరిస్థితుల నుంచి బయటపడేశారు. వివరాల్లోకి వెళితే..
 
బ్రిటన్‌కు చెందిన 22 ఏళ్ల యువతి ఆస్ట్రేలియాకు వెళ్లింది.  అక్కడే తనకు ఓ యువకుడితో పరిచయం అయింది. ఆ తర్వాత అతడిని నమ్మి రోడ్డు ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకుంది. అలా మొదలుపెట్టిన ప్రయాణమే ఆ యువతి పాలిట శాపంగా మారింది. తిరిగి వెళ్లడాన్ని అడ్డుకున్న ఆ యువకుడు తొలుత ఆమెకు ఇష్టం లేకుండా లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం బంధించి జనవరి 2 నుంచి మార్చి 5వరకు ఆయా ప్రాంతాలకు తిప్పాడు. ఈ క్రమంలో పలుచోట్ల అత్యాచారం పరంపర కొనసాగించాడు. సిగరెట్లతో కాల్చడం, కత్తితో కోయడం, విపరీతంగా కొట్టడంలాంటి వికృతచేష్టలతో ఉన్మాదిలా ప్రవర్తించాడు.
 
ఇలా మార్చి 6న(సోమవారం) కూడా ఆమెను వేరే చోటుకు తీసుకెళుతుండగా దారిలో పోలీసులు ఉన్నది గమనించాడు. తాను వెనుక సీట్లో దాక్కుంటానని, కారును పోనియ్యాలని బాధితురాలిని భయపెట్టాడు. అదృష్టవశాత్తు పోలీసులు చూసి ఆమె ముఖంపై గాయాలు గుర్తించి అనుమానంతో కారులో నుంచి బయటకు లాగేశారు. అనంతరం కారు వెనుకాలే ఉన్న 22 ఏళ్లు పైబడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించనున్నారు. ఈ యువకుడిపై దాదాపు పదుల సంఖ్యలో ఈ తరహా కేసులు నమోదుచేశారు. రోడ్‌ ట్రిప్‌ వెళ్లేందుకు ఆస్ట్రేలియా చాలా అద్బుతంగా ఉంటుంది. ప్రతి ఏటా ఇక్కడకు ఈ కారణంతోనే దాదాపు ఆరులక్షలమంది పర్యాటకులు వస్తారని అంచనా.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాపిల్ ఐఫోన్-8 స్మార్ట్ ఫోన్ వివరాలు లీక్... ఫీచర్లు ఏంటంటే?