బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు ఆ దేశ ప్రధాని థెరిసా మె పై విశ్వాసం ఉంచారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదలగాలన్న నిర్ణయం (బ్రెగ్జిట్)పై జరిగిన ఓటింగ్‌లో ఆమె ఓడిపోయారు. కానీ, ఆమెపై పార్లమెంట్‌లో జరిగిన అవిశ్వాస పరీక్షలో మాత్రం విజయం సాధించారు. అంటే తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో థెరిసా మె గెలుపొందారు. దీంతో థెరిసా బ్రిటన్ ప్రధానిగా కొనసాగనున్నారు.
325 మంది ఎంపీలున్న బ్రిటన్ పార్లమెంట్‌లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి థెరెసా మె పై లేబర్ పార్టీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో 306 మంది ఎంపీలు థెరిసాకు అనుకూలంగా ఓటు వేశారు.
ఫలితంగా లేబర్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అనంతరం బ్రెగ్జిట్ ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా ప్రతిపక్ష నేతలను బ్రిటన్ ప్రధాని థెరెసా ఆహ్వానించారు. బ్రెగ్జిట్ ఒప్పందంపై వీలైనంత త్వరగా నిర్ణయానికి రావాలని ఆమె పిలుపునిచ్చారు.