Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిన్ లాడెన్‌ను హతమార్చామంటే.. లైవ్‌లో ట్వీట్ చేసిన సీఐఏ!

Advertiesment
బిన్ లాడెన్‌ను హతమార్చామంటే.. లైవ్‌లో ట్వీట్ చేసిన సీఐఏ!
, సోమవారం, 2 మే 2016 (15:23 IST)
అంతర్జాతీయ సమాజాన్ని గడగడలాడించి.. అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్. పాకిస్థాన్ డాక్టర్ సహకారంతో అమెరికాకు నావికా దళానికి చెందిన సీల్స్ విభాగం మెరుపుదాడి చేసి హతమార్చింది. ఈ దాడిని ఎలా చేసిందో లైవ్‌లో వివరిస్తూ సీఐఏ తన సోషల్ నెట్‌వర్క్ సైట్ ట్విట్టర్‌లో ట్వీట్ల రూపంలో కళ్లకుకట్టినట్టు వివరించింది. లాడెన్‌ను హతమార్చి ఐదేళ్లు అయిన సందర్భంగా ఈ ట్వీట్స్ చేసింది. 
 
ఈ సందర్భంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా అబొట్టాబాద్ ఆపరేషన్ రహస్యాలను మళ్లీ జరిగినట్లుగానే పేర్కొంది. సీఐఏ ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తినా ట్వీట్లు మాత్రం ఆపరేషన్‌ను ఆసక్తికరంగా ప్రజెంట్ చేయడం గమనార్హం. నెప్ట్యూన్ స్పియర్ పేరుతో సాగిన ఆ ఆపరేషన్‌ను ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అబొట్టాబాద్ ఆపరేషన్‌ను అధ్యక్షుడు ఒబామా సిచ్యువేషన్ రూమ్ నుంచి స్వయంగా వీక్షించారు. ఆ ఫోటోను కూడా రిలీజ్ చేశారు. 
 
సీఐఏ తన ట్విట్టర్ ఫాలోవర్లకు ఆదివారం ఈ అవకాశాన్ని కల్పించింది. యూబీఎల్ రెయిడ్ హ్యాస్‌ట్యాగ్‌తో లాడెన్ డెత్ స్టోరీని ప్రజెంట్ చేశారు. ఆ ఆపరేషన్‌ను సీఐఏ కీర్తించింది. లాడెన్‌ను చంపి, ఆల్-ఖయిదాను సమూలంగా దెబ్బతీసిన ఆ ఘటన ఒకరకంగా రీట్వీట్లతో అమెరికా ప్రజలకు థ్రిల్ పుట్టించింది. అబొట్టాబాద్ కాంపౌండ్‌లో లాడెన్ ఎక్కడున్నాడన్న విషయాన్ని కూడా ట్వీట్ చేశారు. ఆపరేషన్ టైమ్‌లో లాడెన్ మూడవ అంతస్తులో ఉన్నాడు. అక్కడే అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... బూడిదను కూడా చిక్కకుండా చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫిరాయింపుల్లో తారాస్థాయి... మంత్రి తారక రామారావు పొంగులేటికి ఎదురేగి...