Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మళ్లీ పెళ్లి కొడుకు కానున్న బిల్ గేట్స్.. పెళ్లికూతురు ఎవరో తెలుసా? (Video)

Advertiesment
bill gates - milinda gates
, మంగళవారం, 3 మే 2022 (09:33 IST)
మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మళ్లీ పెళ్లి కొడుకు కానున్నాడు. భార్యతో గత ఏడాది విడాకులు తీసుకున్న ఆయన మళ్లీ ఆమెనే పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. 
 
మెలిండాతో వైవాహిక జీవితం గొప్పగా సాగిందని, ప్రస్తుతం ఆమెతో విడిపోయినా వృత్తిపరంగా మాత్రం ఇద్దరం కలిసే పనిచేస్తున్నామని తెలిపారు. మరొకరిని రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు రాలేదన్నారు. మళ్లీ మెలిండానే పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్నకు, అవునని సమాధానమిచ్చారు.
 
బిల్‌ గేట్స్‌, మెలిండా గేట్స్‌ దంపతులు దాదాపు 30 ఏళ్ల వైవాహిక జీవితం తరువాత 2021 ఆగస్టులో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటినుంచి తన జీవితం విచిత్రంగా అనిపిస్తోందని బిల్‌ గేట్స్‌ అన్నారు.
 
తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఓవైపు కరోనా, మరోవైపు మెలిండాతో విడాకులు, పిల్లలు కూడా ఇంటినుంచి వెళ్లిపోవడంతో జీవితం అసహజంగా ఉందన్నారు. అందుకే ఆమెను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమన్నట్లు బిల్ గేట్స్ తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచార గృహానికి డబ్బులు చెల్లించి వెళ్లిన విటుడు ఓ కస్టమర్ : ఏపీ హైకోర్టు