Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూయార్క్ నగర వీధుల్లో డొనాల్డ్ ట్రంప్.. పదుల సంఖ్యలో బికినీ మోడల్స్‌తో హల్ చల్

అమెరికా అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళలపై నోరు పారేసుకోవడం, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించాడని ఎందరో ఆరోపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా న్యూయార్క్ వీధుల్లో నక

Advertiesment
Bikini
, బుధవారం, 26 అక్టోబరు 2016 (16:11 IST)
అమెరికా అధ్యక్ష పీఠం కోసం ఉవ్విళ్లూరుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మహిళలపై నోరు పారేసుకోవడం, మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించాడని ఎందరో ఆరోపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా న్యూయార్క్ వీధుల్లో నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు.

ట్రంప్ సొంతూరు న్యూయార్క్ కావడంతో అక్కడి మాన్ హట్టన్ వీధుల్లో ట్రంప్ పేరుమీద ట్రంప్ టవర్స్, ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్.. లాంటి ఎన్నో వ్యాపారకేంద్రాలున్నాయి. అలాంటి చోట మంగళవారం నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు. పదుల సంఖ్యలో మోడల్స్ వెంటరాగా అచ్చం ట్రంప్ లాంటి హెయిర్ స్టైల్, హావభావాలతో అందరినీ ఆకట్టుకున్నాడు. 
 
ఇంతకీ ఇదేదో ఎన్నికల ప్రచారం అనుకుంటే మాత్రం పొరపాటే. బ్రిటన్‌కు చెందిన మహిళా ఫోటోగ్రాఫర్ అలిసన్ జాక్సన్ పేరు విన్నట్లైతే.. ఆమె స్పూప్ ఫోటోగ్రాఫర్‌గా బాగా ఫేమస్. సెలబ్రిటీలను పోలిన వ్యక్తులను వెతికిపట్టుకుని ఫొటో ఆల్బమ్స్ రూపొందిస్తుంది. ప్రస్తుతం ఆమె చేతికి ట్రంప్ చిక్కాడు.

చికాగోకు చెందిన 63 ఏళ్ల వ్యక్తి ట్రంప్‌లా కనిపిస్తాడు. ట్రంప్ హావభావాలు ప్రదర్శిస్తాడు. సదరు ఆల్బంలోని ఫొటోల ప్రదర్శన ప్రారంభంకానున్న నేపథ్యంలో న్యూయార్క్ నగరంలో నకిలీ ట్రంప్ హల్ చల్ చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నన్ను తొలగించడం అసాధారణ విపరీత చర్య... బోర్డుపై మిస్త్రీ ఈమెయిల్‌ అస్త్రం