అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కిందపడ్డారు. ఆయన సరదాగా సైకిల్ తొక్కారు. ఆ తర్వాత సైకిల్ దిగుతూ తూలి కిందపడ్డారు. అయితే, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన ప్రజలను కలుసుకునేందుకు సైకిల్‌పై వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివారలను పరిశీలిస్తే, డెలావర్‌లోని తన నివాసంలో ఉన్న కేప్ హెన్లోపెన్ పార్క్ వద్ద తనను చూసేందుకు అనేక మంది స్థానికులు తరలి వచ్చారు. వారి వద్దకు వెళ్లేందుకు బైడెన్ సైకిల్‌పై బయలుదేరాడు. సైకిల్ దిగే సమయంలో బైడెన్ పాదం పెడెల్‌లో ఇరుక్కపోయింది.
దీంతో కింద దిగాలని భావించారు. ఈ క్రమంలో తూలి కుడివైపునకు పడిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన్ను లేపారు. ఆ తర్వాత బైడెన్ మాట్లాడుతూ, తాను బాగానే ఉన్నానని, ఆందోళన అక్కర్లేదన్నారు.