Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ధనవంతుడితో ఒక్కరాత్రి వ్యభిచరిస్తే డబ్బు... ప్రపంచ సుందరి 2015కి మహిళ ఆఫర్

సింగపూర్, మలేషియా అనగానే బాగా సంపన్నులు ఉంటారని పేరు. అందుకు తగ్గట్లుగానే వార్తలు కూడా వస్తుంటాయి. ప్రపంచ సుందరి 2015 నటాషాకు కూడా ఓ అనుభవం ఎదురైందట. తను సింగపూర్ వెళ్లినప్పుడు ఓ మహిళ తన వద్దకు వచ్చి తనకు తెలిన బడా పారిశ్రామికవేత్తతో ఒక్క రాత్రి వ్యభ

Advertiesment
Beauty Queen Natasha
, గురువారం, 5 జనవరి 2017 (18:56 IST)
సింగపూర్, మలేషియా అనగానే బాగా సంపన్నులు ఉంటారని పేరు. అందుకు తగ్గట్లుగానే వార్తలు కూడా వస్తుంటాయి. ప్రపంచ సుందరి 2015 నటాషాకు కూడా ఓ అనుభవం ఎదురైందట. తను సింగపూర్ వెళ్లినప్పుడు ఓ మహిళ తన వద్దకు వచ్చి తనకు తెలిన బడా పారిశ్రామికవేత్తతో ఒక్క రాత్రి వ్యభిచరిస్తే కావల్సినంత డబ్బు ఇప్పిస్తానని ఆఫర్ ఇచ్చిందని చెప్పింది. 
 
అంతేకాదు, పిలిచినప్పుడల్లా కొందరు ప్రైవేట్ క్లయింట్లతో వ్యభిచరిస్తే కావల్సినంత డబ్బు ఇస్తానని చెప్పినట్లు వెల్లడించింది. దీనికి నటాషా నేరుగా సోషల్ మీడియా ద్వారా బదులిచ్చింది. తనకు అలాంటివి ఇష్టం లేదనీ, ఇంకెప్పుడూ ఇలాంటి అభ్యర్థనలు చేయవద్దని తెలిపింది. ఆశ్చర్యకరంగా సదరు వ్యక్తి నుంచి మళ్లీ ఓ సందేశం వచ్చిందట. అదేమిటంటే... నువ్వు కోరుకున్నంత డబ్బు, ఇష్టమేనా అంటూ. దానితో షాక్ తిన్న నటాషా వారికి మరోసారి ఘాటుగా సమాధానమిచ్చిందట. సింగపూర్ బడా వ్యాపారవేత్తల్లో కొందరికి ఇలాంటివి మామూలేనని తెలుస్తోంది. అంతకుముందు కూడా మరో అందగత్తెకు సేమ్ టు సేమ్ ఇలాంటి సందేశమే పంపారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్ సీఈఓ పిచాయ్ పిచ్చపిచ్చగా అభిమానించే నటి ఎవరో తెలుసా?