ఒబామా నిష్క్రమణ తర్వాత అగ్రస్థానంలోకి నరేంద్ర మోడీ... ఎందులో?
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే శనివారంతో ఒబామా దేశాధ్యక్ష స్థానం నుంచి వైదొలుగుతారు. ఈ నేపథ్యంలో...
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా నిష్క్రమించనున్నారు. ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. అంటే శనివారంతో ఒబామా దేశాధ్యక్ష స్థానం నుంచి వైదొలుగుతారు. ఈ నేపథ్యంలో... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
బరాక్ ఒబామా ఉన్నంతకాలం సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోయర్లను కలిగి ఉన్న దేశాధినేతగా ఉన్నారు. కానీ, శనివారం నుంచి ఆయన దేశాధినేత కాదు కాబట్టి.. ఆయన తర్వాత రెండోస్థానంలో ఉన్న మన ప్రధాని మోడీ ఆటోమేటిగ్గా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోనున్నారు.
సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విటర్, గూగుల్ ప్లస్.. ఇలా అన్నింటినీ కలుపుకొంటే నంబర్ వన్ ఆయనే అనే పీఎంవో అధికారులు చెబుతున్నారు. మోడీని ట్విటర్‌లో 2.65 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 3.92 కోట్ల మంది, గూగుల్ ప్లస్‌లో 32 లక్షల మంది, లింక్‌డ్‌ఇన్‌లో 19.9 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షల మంది, యూట్యూబ్‌లో 5.91 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.