Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బంగ్లాలో పెరుగుతున్న హిందూ జనాభా.. కానీ హింసకు ఐఎస్ కారణమా.. హసీనా ఏం చేస్తున్నారు?

బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస పెరిగిపోతున్న తరుణంలో బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (బీబీఎస్) విడుదల చేసిన తాజా నివేదికలో బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా పెరుగుతోంది. పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో 2015

Advertiesment
Bangladesh: Hindu population grows by 1% in a year
, శుక్రవారం, 24 జూన్ 2016 (15:15 IST)
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస పెరిగిపోతున్న తరుణంలో బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (బీబీఎస్) విడుదల చేసిన తాజా నివేదికలో బంగ్లాదేశ్‌లో హిందువుల జనాభా పెరుగుతోంది. పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌లో 2015 మొత్తం జనాభాలో హిందువుల సంఖ్య 10.7 శాతమని బీబీఎస్ తెలిపింది.

బంగ్లాదేశ్ జనాభా 15.89 కోట్లు కాగా.. ఇందులో హిందువుల సంఖ్య 1కోటి 70లక్షలుగా నివేదికలో వెల్లడైంది. 2014లో 1కోటి 55 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య 15 లక్షలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. కాగా ఈ లెక్కలు పూర్తిగా ర్యాండమ్ శ్యాంపిల్ ద్వారా లెక్కించినట్లు బీబీఎస్ తెలిపింది. 
 
కానీ బంగ్లాలో  హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. గత రెండు నెలల్లో దాదాపు 11 మంది హిందువులను గుర్తు తెలియని దుండగులు పాశవికంగా హత్య చేశారు. గత ఏడాది నుంచి మొదలైన హింసలో లౌకికవాద రచయితలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణాలకు కారణం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలతో మైనారిటీలు బిక్కుబిక్కుమంటున్నారు. 
  
గతంలో ధనవంతులైన హిందువులపై దాడులు, అమ్మాయిలపై అత్యాచారాలు జరిగితే.. ప్రస్తుతం నిరుపేదలైన సాధారణ హిందువులను కూడా హత్య చేస్తున్నట్లు బంగ్లాదేశ్ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ దాడులు ఐఎస్ చర్య అనేది తెలియాల్సి వుందని చెప్తున్నారు. మరి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి హిందువులపై జరిగే హింసకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ టు అమరావతి : సైకిల్‌‌పై బయలుదేరిన ఏపీ ప్రభుత్వ మహిళా ఉద్యోగి.. 26 రాత్రికి చేరిక!