Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమెరికాలో రెండుసార్లు పుట్టిన పాప: యూట్యూబ్‌లో వీడియో వైరల్..

ఇదేంటి పాప రెండుసార్లు పుట్టిందా? ఏ తల్లైనా బిడ్డకు ఒక్కసారేగా జన్మనిస్తుందనే డౌట్ కలిగింది కదా. అయితే చదవండి. అమెరికాలో తల్లి గర్భ సంచి నుంచి రెండుసార్లు జన్మించిన శిశువుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు

అమెరికాలో రెండుసార్లు పుట్టిన పాప: యూట్యూబ్‌లో వీడియో వైరల్..
, బుధవారం, 26 అక్టోబరు 2016 (14:42 IST)
ఇదేంటి పాప రెండుసార్లు పుట్టిందా? ఏ తల్లైనా బిడ్డకు ఒక్కసారేగా జన్మనిస్తుందనే డౌట్ కలిగింది కదా. అయితే చదవండి. అమెరికాలో తల్లి గర్భ సంచి నుంచి రెండుసార్లు జన్మించిన శిశువుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెక్సాస్‌లోని చిల్ట్రన్స్ హాస్పిటల్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది.

టెక్సాస్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఈ ఆసుపత్రిలో చేరింది. కానీ గర్భస్థ శిశువుకు ట్యూమర్ పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బిడ్డ కడుపులో ఉండగానే పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్‌ను తొలగించారు.
 
ట్యూమర్ వల్ల దాదాపు బిడ్డ గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో బిడ్డను బయటకు తీస్తే ప్రాణాలకే ప్రమాదమని మళ్లీ ఆ పిండాన్ని గర్భాశయంలోకి పంపించారు. 13 వారాల తర్వాత ఆమెకు చికిత్స చేసి బిడ్డను తల్లి కడుపులో నుంచి బయటకు తీశారు. ఈ అరుదైన చికిత్సకు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

వైద్యుల శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో ఆ పాపకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ బిడ్డకు సోషల్ మీడియాలో ఆశీస్సులు వెల్లువెత్తుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో దారుణం : మెడకు చున్నీ చుట్టి బైక్‌కు కట్టేసి ఈడ్చుకెళ్లారు.. బైక్‌తో తొక్కించి చంపేశారు