Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియా వీసా నిబంధనల మార్పు సిఫార్సులు.. భారత విద్యార్థులకు నష్టమా?

ఆస్ట్రేలియా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులు చేర్పులుచేయనుంది. నైపుణ్యంగల ఉద్యోగులను ఆహ్వానిస్తున్న ఆస్ట్రేలియా వారి కుటుంబాలను చిన్నచూపు చూడవద్దని వలసదారులు కోరుతున్నారు. స్కిల్డ్ వర్కర్లు, వారి కు

Advertiesment
australia visa rules
, శనివారం, 17 సెప్టెంబరు 2016 (09:45 IST)
ఆస్ట్రేలియా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులు చేర్పులుచేయనుంది. నైపుణ్యంగల ఉద్యోగులను ఆహ్వానిస్తున్న ఆస్ట్రేలియా వారి కుటుంబాలను చిన్నచూపు చూడవద్దని వలసదారులు కోరుతున్నారు. స్కిల్డ్ వర్కర్లు, వారి కుటుంబాల మధ్య సమతుల్యత సాధించేవిధంగా ఇమ్మిగ్రేషన్ విధానాన్ని అమలు చేయాలని అడుగుతున్నారు. ప్రభుత్వ స్వతంత్ర పరిశోధక సంస్థ అయిన ప్రొడక్టివిటీ కమిషన్ ఇటీవల చేసిన సిఫారసులపై వలసదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఫెడరేషన్ ఆఫ్ ఎథ్నిక్ కమ్యూనిటీస్ కౌన్సిల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా ఈ సిఫారసులపై స్పందిస్తూ స్కిల్డ్ వర్కర్లను ఆకర్షించడంపైన మాత్రమే అత్యధిక దృష్టి పెట్టారని, వారి కుటుంబాలను పట్టించుకోలేదని ఆరోపించింది. పేరెంట్ వీసాలకు ఫీజులు పెంచాలని సిఫారసు చేయడం సమంజసం కాదని పేర్కొంది. కొన్ని సిఫారసులు చేసిన ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆర్థిక ప్రభావంపైనే దృష్టి సారించిందన్నారు. కుటుంబం అందించే సాంఘిక, సాంస్కృతిక సేవలను తక్కువ అంచనా వేసిందన్నారు. పేరెంట్ వీసాలను తగ్గించడానికే ఈ సిఫారసులు ప్రాధాన్యమిస్తున్నాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం