Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్ బాబ్ నగరంపై రెచ్చిపోయిన ఐసిస్.. 60మంది మృతి..!

టర్కీ మద్దతుతో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిరియాలోని అల్-బాబ్ నగరంలో శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్- బాబ్ నగరం సమీపంలోని సుసైన్ గ్రామంలో రెబల్

అల్ బాబ్ నగరంపై రెచ్చిపోయిన ఐసిస్.. 60మంది మృతి..!
, శనివారం, 25 ఫిబ్రవరి 2017 (10:00 IST)
టర్కీ మద్దతుతో ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సిరియాలోని అల్-బాబ్ నగరంలో శుక్రవారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్- బాబ్ నగరం సమీపంలోని సుసైన్ గ్రామంలో రెబల్ కమాండ్ సెంటర్ వద్ద పేలుడు పదార్ధాలతో నింపి ఉన్న వాహనంతో ఆత్మాహుతి దాడి చోటుచేసుకున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. 
 
ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. అల్-బాబ్ నగరంపై ఆధిక్యం కోసం ఐసిస్ ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఐసిస్‌పై పోరాడేందుకు గత ఆగస్టులో టర్కీ సిరియాకు బలగాలను పంపిన సంగతి విదితమే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనం అమెరికాకు చెందినవారిమేనా? శ్రీనివాస్ సహచరి ప్రశ్న