Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి వేడుకకు వస్తున్న ట్రక్కు నదిలో బోల్తా.. 71 మంది జలసమాధి

car accident

ఠాగూర్

, మంగళవారం, 31 డిశెంబరు 2024 (09:48 IST)
సౌత్ ఇథియోపిచాలో పెను విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వస్తున్న బస్సు ఒకటి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 71 మంది జలసమాధి అయ్యారు. వీరిలో 68 మంది పురుషులే ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం సాయంత్రం ఈ ఘోర ఘటన జరిగింది. 
 
దక్షిణ ఇథియోపియాలో ఓ వివాహానికి హాజరైన బృందం తిరిగి స్వస్థలానికి వెళుతుండగా ట్రక్కు అదుపుతప్పి సిదమా రాష్ట్రంలోని గెలాన్ వంతెనపై నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రమాదం జరిగిన సమయంలో నదిలో నీటి ప్రహావం ఉధృతంగా ఉండటంతో తక్షణం సహాయక చర్యలను చేపట్టలేకపోయారు. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉంది. జలసమాధి అయిన 71 మందిలో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?