వధూవరులతో కలిసి పెళ్ళి లారీ నదిలో పడిపోయింది.. 47మంది మృతి
పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైం
పెళ్లి సంబరాలు అట్టహాసంగా ముగిశాయి. ఆ సందడి పూర్తికాకముందే ఆ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. వధూవరులతో కలిసి పిల్లలు, పెద్దలు అంతా సంబరంగా లారీలో వేరొకచోటకు వెళ్తున్నారు. అంతలోనే సంతోషమంతా ఆవిరైంది. ఓ నదిపై ఉన్న బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా అదుపు తప్పి లారీ నదిలో పడిపోయింది.
వధూవరులు, 9 మంది పిల్లలు, 27 మంది మహిళలు, 9 మంది పురుషులు... మొత్తం 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆఫ్రికాలోని మడగాస్కర్ రాజధాని అంటాననరివోకు 90 కిలోమీటర్ల దూరంలోని అంజోజోరోబ్ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.