Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు.. 15మంది మృతి.. ఉగ్రమూకల పనేనా?

Advertiesment
ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు.. 15మంది మృతి.. ఉగ్రమూకల పనేనా?
, శుక్రవారం, 18 డిశెంబరు 2020 (19:15 IST)
ఆప్ఘన్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి పేలుళ్లు జరుగుతాయో అని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఆప్ఘనిస్థాన్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆఫ్ఘన్ లోని ఘాజీ ప్రావిన్స్ లోని గెలాన్ జిల్లాలో జరిగింది. గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లు సంభవించాయి. 
 
పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయా లేదంటే, ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్కగానొక్క కుమార్తె, ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపేసింది