Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై నగ్నంగా పరుగులు తీసిన యువతి... ఎందుకు?

మహిళకు ధనం, ప్రాణం కంటే మానం ఎంతో మిన్న అని చెప్తుంటారు. అటువంటిది ఓ యువతి తను దుస్తులు విప్పేసి నడి రోడ్డుపైకి వచ్చేసింది. ఆమె చర్యతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా తనదై

Advertiesment
Argentinean Woman
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (14:23 IST)
మహిళకు ధనం, ప్రాణం కంటే మానం ఎంతో మిన్న అని చెప్తుంటారు. అటువంటిది ఓ యువతి తను దుస్తులు విప్పేసి నడి రోడ్డుపైకి వచ్చేసింది. ఆమె చర్యతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా తనదైన మార్గంలో ఒంటిపై నూలుపోగు లేకుండా అలా నడుచుకుంటూ వెళ్లింది.
 
ఈ ఘటన వివరాలను ఒకసారి చూస్తే...  అర్జెంటీనా దేశానికి చెందిన 27 ఏళ్ల యువతి తను ప్రేమించిన అబ్బాయి కనబడకపోవడంతో ఆందోళనకు గురైంది. అతడు తనను వదిలించుకునేందుకు కనిపించకుండా పారిపోయాడా లేదంటే ఎవరైనా అతడిని కిడ్నాప్ చేశారో తెలియరాలేదు. ఐతే అతడు కనిపించకుండా పోయినందుకు అతడ్ని ఎలాగైనా బయటకు లాగాలని నిర్ణయించుకున్న సదరు యువతి ఓ వినూత్న మార్గాన్ని ఆచరించింది. అదేంటయా అంటే... దుస్తులన్నీ విప్పేసి తన బోయ్ ఫ్రెండు కోసం నడిరోడ్డుపై నడవడం ద్వారా సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాలనుకుంది.
 
ఇలా నగ్నంగా నడిచినందుకు అందరి దృష్టిలోకైతే వెళ్లింది కానీ ఆమె బోయ్ ఫ్రెండ్ ఆచూకి మాత్రం లభించలేదు. ఆమె అలా నగ్నంగా వీధుల్లోకి రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గూగుల్‌లో ఇకపై సెక్స్ నిర్ధారణకు సంబంధించిన సమాచారం ఉండదు.. ఆటో బ్లాక్ చేసేశారు..