అమెరికాలోని ఓహియో ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి చాలాకాలంగా ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు. ఇటీవల ఎప్పటిలాగానే ఆపిల్ ఐఫోన్‌ను తన ప్యాంటు జేబులో వుంచి నడిచి వెళ్తుండగా.. వేల రూపాయల విలువగల ఐఫోన్ ఉన్నట్టుండి పేలింది.
ఆపిల్ ఫోన్ పేలడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆపిల్ ఫోన్ పేలడంతో ప్యాంట్‌కు నిప్పు అంటుకుందని.. ఆ మంటల్ని ఆర్పడంతో ఊపిరి పీల్చుకున్నానని ఆపిల్ సంస్థ వెల్లడించింది.
దీనిపై ఆపిల్ సంస్థకు ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకు ఆ సంస్థ ఆ వ్యక్తికి కొత్త ఆపిల్ ఫోన్‌ను అందించేందుకు సిద్ధమని ప్రకటించింది. అయినా బాధిత వ్యక్తి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి లాయర్లను ఆయన సంప్రదించినట్లు తెలుస్తోంది.