'అమెరికన్స్ కౌంటింగ్ వోట్స్... ఇండియన్స్ కౌంటింగ్ నోట్స్’.. సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్స్
అటు అమెరికాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠత రేపుతోంది. అలాగే, భారత్‌లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు.
అటు అమెరికాలో ఓట్ల లెక్కింపు ఉత్కంఠత రేపుతోంది. అలాగే, భారత్‌లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఆ దేశంలో ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయపథంలో దూసుకెళుతుండగా, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వెనుకబడిపోయారు.
అదేసమయంలో భారత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ.1000, రూ.500 విలువ చేసే నోట్లను రద్దు చేస్తూ సంచలన ప్రకటన చేశారు. ఇది భారత్‌లోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ప్రస్తుతం ఈ అంశం సోషల్‌మీడియాలో ఈ రెండు విషయాలే హాట్ టాపిక్. రెండు అంశాలను పోల్చుతూ, రెండింటిపై సెటైర్లు వేస్తూ, మెచ్చుకుంటూ నెటిజన్లు ట్రెండుకు తగ్గ ఎంజాయ్ చేస్తున్నారు. ‘అమెరికన్స్ కౌంటింగ్ వోట్స్... ఇండియన్స్ కౌంటింగ్ నోట్స్’ అనే నినాదంతో ట్విట్టర్‌లో యాష్ ఇండియన్ నోట్స్ (#indiannotes) ట్యాగ్‌ను సృష్టించిన భారతీయులు వారి అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు.
అమెరికాలో ఎన్నికల ఫలితాల ఉత్కంఠ నెలకొంటే ఇండియాలో నోట్ల మార్పిడీ ఉత్కంఠ నెలకొందని పేర్కొంటున్నారు. కొందరు ఇప్పటికే భారతీయుల బ్లాక్ మనీ అమెరికన్ డాలర్ల రూపంలో సురక్షితంగా ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే నకిలీ నోట్లకు మాత్రం ఇక ఇండియాలో చెల్లు అని అంటున్నారు. నల్లకుభేరుల్లో వణుకు పుడుతోందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తోంటే... పేదలకు న్యాయం జరుగుతోందని మరికొందరు పేర్కొంటున్నారు.