Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

14ఏళ్ల స్టూడెంట్‌తో కారులోనే రాత్రంతా టీచర్ రాసలీలలు-20 ఏళ్ల జైలు

Advertiesment
14ఏళ్ల స్టూడెంట్‌తో కారులోనే రాత్రంతా టీచర్ రాసలీలలు-20 ఏళ్ల జైలు
, శుక్రవారం, 10 జులై 2020 (19:15 IST)
లేడీ టీచర్ కాదు.. కీచకురాలు. తన స్కూలులో విద్యను అభ్యసించే 14 ఏళ్ల కుర్రాడికి చుక్కలు చూపించింది. వర్షం పడుతుంటే లిఫ్ట్ ఇస్తానని చెప్పి... విద్యార్థిని కారులో ఎక్కించుకొని అందులోనే కుర్రాడిపై లైంగిక దాడి చేసింది. ఈ ఘటన అమెరికాలోని ఆరిజోనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక అకాడమిలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న 28 ఏళ్ల లూసి పాఠశాలకు వచ్చే 14 ఏళ్ల విద్యార్థితో పరిచయం పెంచుకుంది. అతడు వద్దన్నా సరే అతడికి శృంగార పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది.
 
అంతటితో ఆగక ఒక అడుగు ముందుకేసి, తన నగ్న ఫోటోలను తరచూ విద్యార్థి ఫోన్‌కు పంపేది. అంతేకాదు కుర్రాడిని ప్రేరేపించి శృంగారానికి ఉసిగొల్పింది. గతవారం వర్షం కురవడంతో పాటీ చీకటి పడటంతో కుర్రాడు స్కూలులోనే చిక్కుకుపోయాడు. అలా ఇంటికి బయలుదేరిన లూసీ... కుర్రాడికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారు ఎక్కించుకుంది. అయితే భయపడుతూనే కుర్రాడు కారు ఎక్కాడు. 
 
కాసేపు అయ్యాక ఆ టీచర్ కుర్రాడికి చాక్లెట్ తినమని ఇచ్చింది. అందులో మాదక ద్రవ్యాలు కలపడంతో కుర్రాడు మత్తులోకి జారుకున్నాడు. దీంతో అదే అదనుగా భావించిన లూసీ కుర్రాడిపై లైంగిక దాడి చేసింది. కారులోనే రాత్రంతా అతడితో రాసలీలలు జరిపింది.
 
అయితే విద్యార్థి ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు, అతడి ఫోన్‌లోని టీచర్ నగ్నఫోటోలను చూసి షాక్ తిన్నారు. కుర్రాడికి కౌన్సిలింగ్ ఇవ్వగా జరిగిన సంగతి చెప్పేసాడు. దీంతో తమ కుమారుడిపై లైంగిక దాడి చేసిన టీచర్ లూసీని ఉపేక్షించేది లేదంటూ కేసు నమోదు చేశారు. టీచరమ్మపై కేసు నమోదు విషయం తెలుసుకున్న పాఠశాల ఉన్నత సిబ్బంది ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. పోలీసులు కేసు విచారణలో భాగంగా ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఇరువురి వాదనలు విన్న జడ్జీ టీచరమ్మకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్ టాక్ సూపర్ ప్లాన్.. బీజింగ్‌కు దూరంగా వేరొక చోట హెడ్ ఆఫీస్..?