Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాకు పోటెత్తిన వలసదార్లు... గోడ కడతారని.. జీవనోపాధి కోసం.. ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వలసదారులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను చూసి వేలమ

అమెరికాకు పోటెత్తిన వలసదార్లు... గోడ కడతారని.. జీవనోపాధి కోసం.. ?
, శుక్రవారం, 4 నవంబరు 2016 (16:25 IST)
అమెరికా అధ్యక్ష ఎన్నికలు వలసదారులకు ఎంతో మేలు చేసేలా ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 8వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌ను చూసి వేలమంది శ్రమజీవులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 8న ఎన్నికలు జరగడానికి ముందే ఏదో విధంగా అవకాశాల గని అమెరికాలో కాలు మోపాలని తహతహలాడుతున్నారు.
 
ఎన్నికల తర్వాత డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే సరిహద్దుల్లో గోడ కడతారని, అప్పుడు తమకు జీవనోపాధి దొరకదని బాధపడుతూ వీలైన విధంగా అమెరికాకు చేరుకుంటున్నారు. హిల్లరీ క్లింటన్ దేశాధ్యక్షురాలైతే వలసదారుల పట్ల క్షమాగుణంతో వ్యవహరిస్తారని వలసదారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2016లో ఇప్పటి వరకు 1,17,200 మందిని మధ్య అమెరికాలో పట్టుకున్నారంటేనే పరిస్థితి అర్థమవుతుంది. ఈ ఏడాది 5 వేల మంది హైతీలను సరిహద్దు గస్తీ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
 
ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ గట్టిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ బాగా పుంజుకున్నారని సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూడాలని మద్దతుదారులకు ఒబామా సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్రం షాక్... ఎందుకో తెలుసా?