దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేస్తాం.. అమెరికా హెచ్చరిక
						
		
						
				
ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని అమెరికా మరింతగా ఒత్తిడి చేస్తోంది. లేనిపక్షంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్ర
			
		          
	  
	
		
										
								
																	ఉగ్రమూకలకు మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోవాలని అమెరికా మరింతగా ఒత్తిడి చేస్తోంది. లేనిపక్షంలో ఎలాంటి చర్యలు తీసుకునేందుకైనా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	దౌత్యపరంగా పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేస్తామని కూడా మాటిస్ హెచ్చరించారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోని పక్షంలో నాటో ఇతర అమెరికా మిత్రపక్ష హోదాను కూడా పాక్ కోల్పోవాల్సి ఉంటుందని సైనిక సేవల సెనేట్ కమిటీ ముందు మాటిస్ తేల్చి చెప్పారు. 
 
									
										
								
																	
	 
	దక్షిణాసియాలో సుస్థిరత కోసం ఆ దేశం చర్యలు తీసుకోకుంటే తమ వద్ద అనేక శక్తివంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఆ విషయంలో తాము విజయవంతం అవుతామని మాటిస్ వివరించారు. ముష్కర మూకలపై చర్యలు తీసుకునే విషయంలో అంతర్జాతీయ సమాజంతో కలిసి వస్తే పాకిస్థాన్‌కే మేలు జరుగుతుందని అన్నారు.