Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లరి చేస్తే ఎక్కనివ్వరు.. లెగ్గింగ్స్ వేసుకుంటే ఎక్కనివ్వరు.. ఎయిర్‌లైన్స్ అతి చేస్తోందా?

అమెరికాలో డెన్వర్‌నుంచి మిన్నెపోలిస్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమాన సిబ్బంది ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను విమానంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కారణం వారు పాదాలను బిగుతుగా పట్టి ఉంచే లెగ్గింగ్స్ ను వేసుకోవడమే.

అల్లరి చేస్తే ఎక్కనివ్వరు.. లెగ్గింగ్స్ వేసుకుంటే ఎక్కనివ్వరు.. ఎయిర్‌లైన్స్ అతి చేస్తోందా?
హైదరాబాద్ , మంగళవారం, 28 మార్చి 2017 (09:03 IST)
మూడు రోజుల క్రితం పుణే నుంచి డిల్లీ ప్రయాణంలో విమానంలో సీనియర్ స్టాఫ్‌ని 25 చెప్పుదెబ్బలు కొట్టిన శివసేన ఎంపీని అన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలూ వెలి వేసినంత పనిచేశాయి. నిన్నుగా ఇంక మా విమానాల్లోకి రానివ్వబోమని చెప్పేశాయి. ఎయిర్ లైన్స్ సంస్థల నిర్లక్ష్యపూరిత సమాధానాలు, అహంభావ ధోరమే తానలా ప్రవర్తించడానికి కారణం అని ఆ ఎంపీ మొత్తుకుంటున్నా ఎవరూ వినలేదు. అలాగని విమాన సిబ్బందిని పట్టుకుని చెప్పుతో బాదిన అతడి ఫ్రవర్తన సమర్థనీయం కాదు.
 
అయితే విమానయాన సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనడానికి బోలెడు ఉదాహరణలు కళ్లుముందు కనిపిస్తూనే ఉన్నాయి. అమెరికాలో డెన్వర్‌నుంచి మిన్నెపోలిస్ వెళ్లాల్సిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమాన సిబ్బంది ఇద్దరు టీనేజ్ అమ్మాయిలను విమానంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. కారణం వారు పాదాలను బిగుతుగా పట్టి ఉంచే లెగ్గింగ్స్ ను వేసుకోవడమే.
 
దీనికి విమాన సిబ్బంది చెప్పిన కారణం మరీ వింతగా ఉంది. ఈ అమ్మాయిలు ఉద్యోగుల ప్రయాణ పాస్‌లపై ప్రయాణిస్తున్నారట. ఈ పాస్ కింద అమల్లో ఉన్న  డ్రెస్ కోడ్‌ను పాటించకపోవడం వల్లే వాళ్లను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. పాస్‌లతో ప్రయాణించే ఉద్యోగులు డ్రెస్ కోడ్ ప్రకారం లెగ్గింగ్స్ వంటి స్పాండెక్స్, లిక్రా ప్యాంట్స్ ధరించకూడదట. దీంతో వారిద్దరూ మళ్లీ డ్రెస్ మార్చుకుని తర్వాత విమానంలో వెళ్లినట్టు ఎయిర్‌లైన్స్ ప్రతినిధి జోనాథన్  గ్యూరిన్ పేర్కొన్నారు.
 
కానీ ఈ తతంగాన్ని ప్రత్యక్షంగా చూసిన డెన్వర్ హక్కుల కార్యకర్త షానన్ వాట్స్ మహిళా వస్త్రధారణను ఎయిర్‌లైన్స్‌ నియంత్రించడమేమిటంటూ మండిపడ్డారు. అదే బాలికల తండ్రి షార్ట్ వేసుకున్నావిమానంలోకి అనుమతించడం విడ్డూరమనీ... ఇక్కడే ఎయిర్‌లైన్స్ తన మహిళా వివక్షను బయటపెట్టుకుందని విమర్శించారు.
 
నిబంధనల పేరుతో విమానయాన సంస్తలు ప్రదర్సిస్తున్న అహంభావ వర్తనే ప్రయాణికులు చికాకు పడటానికి కారణమవుతోందని ఎన్ని సార్లు మీడియా రిపోర్టు చేసినా ఆయా సంస్థలు పట్చించుకోవడం లేదు. అందుకే ఇలాంటి ఘటనలు పునరావృత్తమవుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కల్యాణ్‌తో వైకాపా నేరుగా తేల్చుకోనుందా? రోజా నోట జగన్ మాటే వచ్చిందా?