Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలావిలో విమానం మిస్సింగ్... వైస్ ప్రెసిడెంట్ సౌలోస్ పరిస్థితి ఏంటి?

russia plane crash

వరుణ్

, మంగళవారం, 11 జూన్ 2024 (09:06 IST)
తూర్పు ఆఫ్రికాలోని మలావి ఓ విమానం మిస్సింగ్ అయింది. మలావి రక్షణ శాఖకు చెందిన ఈ విమానంలో ఆ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలిమా ఉన్నారు. అలాగే, మరో తొమ్మిది మంది కూడా ఉన్నారు. ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9.17 గంటలకు షెడ్యూల్ ప్రకారం గమ్యస్థానానికి చేరుకోవాల్సి వుంది. ఆ విమానం ఉదం 10.02 గంటల వరకు కూడా ల్యాండింగ్ కాలేదు. పైగా, రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ విమానం అదృశ్యమైనట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
 
రాజధాని నగరం లిలాంగ్వే నుంచి బయలుదేరిన ఈ విమానం రాడార్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని, కాంటాక్టు కోసం ఏవియేషన్ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని మలావి అధ్యక్ష, కేబినెట్ కార్యాలయం ఒక ప్రకటనలో వివరించాయి. కాగా, విమానం కోసం మలావి అన్వేషణ కొనసాగుతోంది. సెర్చ్, రెస్క్యూ ఆపరేషను అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. కాగా అదృశ్యమైన విమానంలో చిలిమా భార్య మేరీ, యునైటెడ్ ట్రాన్స్ ఫర్మేషన్ మూవ్మెంట్ (యూటీఎం) పార్టీకి చెందిన పలువురు అధికారులు ఉన్నారు.
 
మూడు రోజుల క్రితం మాజీ క్యాబినెట్ మంత్రి రాల్ఫ్ కసంబర చనిపోయారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వం తరపున హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు లాజరస్ చక్వేరా తన అధికారిక పర్యటనలను రద్దు చేసుకున్నారు. సెర్చ్ ఆపరేషన్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా విమానం మిస్సింగ్కు కారణం ఇంకా తెలియరాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇక ఏపీ మద్యం షాపుల్లో నో మనీ.. డిజిటల్ చెల్లింపులు మాత్రమే..!