Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగస్టా స్కామ్ : భారత నేతలకు ఇచ్చిన లంచం రూ.115 కోట్లు.. ఇటలీ కోర్టు

అగస్టా స్కామ్ : భారత నేతలకు ఇచ్చిన లంచం రూ.115 కోట్లు.. ఇటలీ కోర్టు
, శుక్రవారం, 6 మే 2016 (17:44 IST)
వీఐపీల సేవల కోసం భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన అగస్టా హెలికాప్టర్ల వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఇటలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ స్కామ్‌లో భారతీయ నేతలకు రూ.115 కోట్లు ముట్టజెప్పినట్టు కోర్టు పేర్కొంది. అగస్టా‌వెస్ట్‌ల్యాండ్ కంపెనీ నుంచి 12 హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఇందుకోసం రూ.3,600 కోట్లు వెచ్చించింది. ఈ భారీ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అగస్టా కంపెనీ ఏకంగా భారతీయ కరెన్సీలో రూ.227 కోట్లుగా ఖర్చు చేయగా, ఇందులో రాజకీయ నేతల వాటాను ఆ కోర్టు రూ.115 కోట్లుగా తేల్చింది. ఈ మేరకు 225 పేజీల తీర్పు కాపీలో ఇటలీ కోర్టు స్పష్టంగా పేర్కొంది. తీర్పు కాపీలోని 9వ పేజీలోనే పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సునంద పుష్కర్ కేసు : ఫోరెన్సిక్ సాక్ష్యాల విశ్లేషణకు కొత్త వైద్య బృందం