Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాను వణికిస్తున్న హైదరాబాద్.. డ్రాగన్ దేశాన్ని తుత్తునియలు చేసే క్షిపణిని తయారు చేసింది ఇక్కడే!

శత్రుదేశం చైనాను హైదరాబాద్ వణికిస్తోంది. దీనికి కారణమేంటో తెలుసా? భారత రక్షణ శాఖ తయారు చేసిన ఖండాంతర క్షిపణిని భాగ్యనగరంలోనే తయారు చేసింది.

Advertiesment
Agni-5 Test
, బుధవారం, 28 డిశెంబరు 2016 (09:49 IST)
శత్రుదేశం చైనాను హైదరాబాద్ వణికిస్తోంది. దీనికి కారణమేంటో తెలుసా? భారత రక్షణ శాఖ తయారు చేసిన ఖండాంతర క్షిపణిని భాగ్యనగరంలోనే తయారు చేసింది. 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తుత్తినియలు చేయగల శక్తిసామర్థ్యాలున్న ఈ క్షిపణి రూపు దిద్దుకున్నది హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్‌లోనే కావడం గమనార్హం. దీంతో చైనా పాలకులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. 
 
సోమవారం అగ్ని-5 ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్‌ను నాలుగోసారి ఒడిశాలోని వీలర్ ఐలండ్‌లో పూర్తిస్థాయిలో విజయవంతంగా పరీక్షించారు. ఈ పరీక్ష పూర్తిగా విజయవంతమైందని డీఆర్‌డీవో పేర్కొంది. ఈ పరీక్షతో భారత్ అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ సరసన చేరింది. ఈ విజయం వెనక కంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ ల్యాబరేటరీ కృషి ఎంతగానో ఉంది.
 
ఈ క్షిపణి డిజైన్ నుంచి అభివృద్ధి వరకంతా హదరాబాద్‌లోనే జరిగింది. 200 మందికిపైగా శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అగ్ని సిరీస్ క్షిపణుల తయారీలో పాలుపంచుకున్న మరో వందమంది శాస్త్రవేత్తలు కూడా ఇందుకోసం సహాయసహకారాలు అందించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అగ్ని-5లో ఉపయోగించిన చాలావరకు పరికరాలు హైదరాబాద్‌లోనే తయారు కావడం. ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ల్యాబరేటరీ(ఏఎస్ఎల్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబరేటరీ(డీఆర్‌డీఎల్)లు ఈ మిసైల్ కోసం పనిచేశాయి.
 
అగ్ని-5 పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత హైదరాబాద్ నుంచి దానిని ఒడిశాకు భారీ ట్రక్కుల సాయంతో రోడ్డు మార్గంలో తరలించారు. క్షిపణిని 12కు పైగా భాగాలుగా విడగొట్టి వీలర్ ఐలండ్‌కు చేర్చారు. అనంతరం అక్కడ అసెంబుల్ చేసి పరీక్షించారు. ఈ క్షిపణి విజయంతో భారత అమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమైన ఆయుధం వచ్చినట్టయింది. ఇప్పుడు ఈ ఖండాంతర క్షిపణిని చూసి చైనా వణుకుతోంది. దీనికి కారణం డ్రాగన్ కంట్రీ మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి రావడమే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుణేలోని ఓ ఇంట్లో పాముల స్మగ్లింగ్.. 70 పాముల్ని కలిగిన బాక్సును సీజ్ చేసిన పోలీసులు..