భారత్‌కు చైనా వార్నింగ్ : మా వస్తువులను బాయ్‌కాట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ఈమధ్య కాలంలో చైనా దేశం భారతదేశానికి వరుసబెట్టి హెచ్చరికలు చేస్తూనే ఉంది. విదేశీయులు(ముఖ్యంగా అమెరికా దేశస్తులు) భారతేదంలోకి వచ్చి, ఏమాత్రం చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తే చాలు జడుసుకుంటోంది. వార్నింగులు ఇస్తోంది. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది
ఈమధ్య కాలంలో చైనా దేశం భారతదేశానికి వరుసబెట్టి హెచ్చరికలు చేస్తూనే ఉంది. విదేశీయులు(ముఖ్యంగా అమెరికా దేశస్తులు) భారతేదంలోకి వచ్చి, ఏమాత్రం చైనా-భారత్ సరిహద్దు ప్రాంతంలో సంచరిస్తే చాలు జడుసుకుంటోంది. వార్నింగులు ఇస్తోంది. తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది చైనా. అదేంటయా అంటే... చైనా వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటూ భారతదేశంలో పనిగట్టుకుని కొందరు కాంపెయిన్ చేయడంపై చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
సోషల్ మీడియాలో వరుసబెట్టి దీనిపై రాతలు రాయడాన్ని తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందనీ, పెట్టుబడులు పెట్టే అవకాశం లేకుండా పోతుందని హెచ్చరించింది. ఐతే చైనా వస్తువులను కొనరాదంటూ ప్రభుత్వం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో ఎవరికివారు చైనా దేశ ఉత్పత్తి అంటే కొనరాదంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంటుందన్న విషయం చైనాకు తెలియదేమో...?